‘మేడిన్‌ ఇండియా’ ఐఫోన్‌ 14 వచ్చేస్తోంది..!

-

టెక్ దిగ్గజం యాపిల్ ఇటీవల విడుదల చేసిన ఐఫోన్-14కు మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే యాపిల్ సంస్థ ఓ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. భారత్ లో యాపిల్ ఉత్పత్తుల విక్రయాన్ని మరింత పెంచే దిశగా.. అడుగులు వేస్తోంది.

ఇందులో భాగంగా ఐఫోన్‌ – 14ను భారత్‌లోనే తయారు చేయాలని నిర్ణయించింది. చైనా తర్వాత అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ విపణిగా ఉన్న భారత్‌లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యాపిల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కొవిడ్‌-19 ఆంక్షల నేపథ్యంలో చైనా నుంచి కొంత మేర ఐఫోన్ల తయారీని వేరే ప్రాంతాలకు మళ్లించాలని చూస్తుండడం కూడా మరో కారణం.

ఐఫోన్‌-ఎస్‌ఈతో భారత్‌లో తమ తయారీ కార్యకలాపాలను యాపిల్ 2017లో ప్రారంభించింది. ప్రస్తుతం ఐఫోన్‌ ఎస్‌ఈ, ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 13ను దేశీయంగా ఉత్పత్తి చేస్తోంది. తాజాగా ఐఫోన్‌-14 కూడా ఆ జాబితాలో చేరనుంది. మరికొన్ని రోజుల్లోనే ‘మేడిన్‌ ఇన్‌ ఇండియా’ ఐఫోన్‌ 14 స్థానిక వినియోగదారుల చేతుల్లోకి చేరుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. చెన్నై శివార్లలో ఉన్న ఫాక్స్‌కాన్‌ తయారీ కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు వీటిని సరఫరా చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news