చోళరాజుల నేపథ్యంలో రూపొందించిన సినిమా ‘పొన్నియిన్ సెల్వన్’. ఈ మూవీ మొదటిభాగం సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్ ముంబయి చేరుకుంది. మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌లో హీరో చియాన్ విక్రమ్ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘‘ది లీనింగ్ టవర్ ఆఫ్ పీసా నిర్మాణాన్ని అందరూ పొగడుతారు.. కానీ మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. వాటి నిర్మాణంలో కనీసం ప్లాస్టర్‌ని కూడా ఉపయోగించలేదు. తంజావూర్ దేవాలయంపై ఎన్నో టన్నుల బరువున్న రాయి ఉంది. దానిని అక్కడ పెట్టడానికి ఎటువంటి క్రేన్‌లను ఉపయోగించలేదు. ఆరు కిలోమీటర్ల ర్యాంపును నిర్మించారు. దాని సహయంతో ఆ రాయిని పైన పెట్టారు. అది ఇప్పటికి ఆరు భూకంపాలను తట్టుకొని నిలిచింది’’ అని విక్రమ్ అన్నారు.
అంతే కాకుండా చోళరాజు రాజరాజచౌహాన్ గొప్పతనం గురించి కూడా విక్రమ్ మాట్లాడారు. ‘‘ఆయన తన పాలనలో 5000 డ్యామ్‌లు నిర్మించారు. ప్రజలకు రుణాలు ఇచ్చారు. ఉచితంగా వైద్యసదుపాయాలు కల్పించారు. పట్టణాలన్నింటికీ మహిళల పేర్లు పెట్టారు. ఒక్కసారి మన సంస్కృతి గురించి ఆలోచించండి. దానికి మనం గర్వపడాలి. ఉత్తరభారతదేశం, దక్షిణ భారతదేశం అని ఏమీ లేదు. మనమంతా భారతీయులం’’ అని అన్నారు.
VERA LEVELLL!
This could probably be the best promotional material about #PonniyinSelvan and it doesn't say a word about the film in particular.
Chiyaan VIKRAM 👏🙏
— Siddarth Srinivas (@sidhuwrites) September 24, 2022