అమెరికాలో ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. అమెరికా వ్యాప్తంగా కూడా జార్జ్ ఫ్లాయిడ్ మృతి పట్ల ఆందోళనలు ఎక్కడా ఆగడం లేదు. ఏ విధంగా కంట్రోల్ చెయ్యాలని చూసిన సరే సైన్యం రంగంలోకి దిగినా సరే అల్లర్లు మాత్రం ఆగడం లేదు. దేశ వ్యాప్తంగా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు అమెరికాలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది.
చాలా వరకు షాపుల్లో దొంగ తనాలు జరుగుతున్నాయి. మొబైల్ ఫోన్ లు సహా అనేకం లూటి చేస్తున్నారు. దీనిపై ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అక్కడి మొబైల్ కంపెనీలు. ఈ తరుణంలో ఆపిల్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. పోయిన ఫోన్స్ ని స్వాధీనం చేసుకోవడానికి గానూ ఆపిల్ ఒక ప్లాన్ వేసింది. కంపెనీ ఈ ఫోన్లకు ‘మిమ్మల్ని ట్రాక్ చేస్తున్నాం’ అనే మెసేజ్ ని పంపిస్తుంది.
పోయిన ఫోన్లను పనిచేయకుండా చేస్తుంది ఆ సంస్థ. ఈ ఫోన్ లోకేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటి కప్పుడు తాము స్థానిక పోలీసులకు అందిస్తున్నామని నోటిఫికేషన్లు పంపిస్తున్నామని సంస్థ నుంచి ఒక ప్రకటన వచ్చింది. దీనిపై సదరు సంస్థ మాత్రం ఇప్పటి వరకూ అధికారికంగా ప్రకటన రాలేదు. కాగా అక్కడ 40 రాష్ట్రాల్లో కర్ఫ్యూ ని వారం పాటు విధించింది అమెరికా ప్రభుత్వం.