విదేశీ సభ్యులకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ షాక్.. 960 మంది ప్రయాణాలపై నిషేధం.. ?

-

దేశంలో కరోనా వ్యాప్తికి కారణం అవడమే కాదు, లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న కారణంతో ఇలా నిబంధనలకు విరుద్ధంగా భారత్‌లోకి ప్రవేశించిన దాదాపు 960 మంది తబ్లిగీ జమాత్‌ సభ్యుల విషయాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుందన్న సంగతి తెలిసిందే.. ఇలా ప్రవర్తించిన వ్యక్తుల ప్రయాణాలపై నిషేధం విధిచిందట.. వీరంతా పదేళ్లపాటు దేశంలోకి రావద్దని పేర్కొంటూ వారిని బ్లాక్‌లిస్టులో పెట్టినట్లు సమాచారం..

ఇక విశ్వసనీయ వర్గాలు తెలిపిన ప్రకారం వీరిలో నలుగురు అమెరికన్లు, తొమ్మిది మంది బ్రిటిషర్లు, ఆరుగురు చైనీయులు ఉన్నారట. ఇకపోతే ప్రాణాంతక వ్యాధి కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లిగీ జమాత్‌ కార్యక్రమానికి వేలాది మంది హాజరుకావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వీరిలో అత్యధికులకు మహమ్మారి సోకడం, వారంతా వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన నేపథ్యంలో.. తబ్లిగీల ద్వారా దేశంలోని పలు ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి చెందిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతే కాక మతపరమైన సమావేశంలో పాల్గొనడానికి టూరిస్టు వీసా మీద భారత్‌కు దాదాపు 67 దేశాల నుండి హజరైన విదేశీయులపై కూడా కేసులు నమోదయ్యాయి.. వీరంతా వీసా నిబంధలను ఉల్లంఘించారట.

 

అదీగాక ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ పెద్దల ఖాతాల్లోకి గల్ఫ్ దేశాల నుంచి కోట్లాది రూపాయల నిధులు మళ్లించినట్లు ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసుల విచారణలో తేలగా, మౌలానాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మనీ ల్యాండరింగ్‌ కేసు నమోదు చేయడమే కాకుండా, ఆయనకు అత్యంత సన్నిహితులు, ముఖ్య అనుచరులుగా వ్యవహరిస్తున్న ఐదుగురి పాస్‌పోర్టులను సీజ్‌ చేసి విచారణ వేగవంతం చేస్తున్నారట..

Read more RELATED
Recommended to you

Exit mobile version