మొబైల్స్ తయారీదారు నోకియా, ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లు కలిసి రెండో నోకియా బ్రాండెడ్ స్మార్ట్ టీవీని రూపొందించి భారత మార్కెట్‌లోకి గురువారం విడుదల చేశాయి. ఇందులో 43 ఇంచుల 4కె అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లేను అందిస్తున్నారు. చాలా సన్నని బెజెల్స్‌ను ఈ టీవీ కలిగి ఉంటుంది. అందువల్ల యూజర్లకు అద్భుతమైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియెన్స్ కలుగుతుంది. ఇందులో ఉన్న ఎంఈఎంసీ టెక్నాలజీ, ఇంటెలిజెంట్ డిమ్మింగ్, వైడ్ కలర్ గామట్, డాల్బీ విజన్ ఫీచర్ల వల్ల ఈ టీవీలో పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఇందులో 24 వాట్ల సామర్థ్యం ఉన్న జేబీఎల్ కంపెనీకి చెందిన స్పీకర్లను ఏర్పాటు చేశారు. ఇవి డీటీఎస్ ట్రూ సరౌండ్ సౌండ్, డాల్బీ ఆడియో ఫీచర్లను కలిగి ఉన్నందున సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ టీవీ ఆండ్రాయిడ్ 9.0 ఆధారంగా పనిచేస్తుంది. గూగుల్ అసిస్టెంట్‌కు ఇందులో సపోర్ట్‌ను అందిస్తున్నారు. అలాగే గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్స్‌ను ఈ టీవీలోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
నోకియా 43 ఇంచుల స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్లు…
* 43 ఇంచుల 4కె అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లే
* 3840 × 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 178 డిగ్రీ వ్యూయింగ్ యాంగిల్
* డాల్బీ విజన్, ఎంఈఎంసీ టెక్నాలజీ, ఇంటెలిజెంట్ డిమ్మింగ్
* 1 గిగాహెడ్జ్ ప్యూరెక్స్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఎ53 ప్రాసెసర్
* 2.25 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ టీవీ 9.0
* వైఫై, బ్లూటూత్ 5.0, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ, ఈథర్‌నెట్
* 24 వాట్ల బాట్ ఫైరింగ్ స్పీకర్స్ (జేబీఎల్ నుంచి)
* డాల్బీ ఆడియో, డీటీఎస్ ట్రూ సరౌండ్ సౌండ్
ఈ స్మార్ట్‌టీవీ ధర రూ.31,999 గా ఉంది. దీన్ని జూన్ 8 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనున్నారు. సిటీ బ్యాంక్ కార్డులపై రూ.1500 ఫ్లాట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు.