ప్రపంచ వ్యాప్తంగా ఆపిల్ వాచ్‌కు ఎంతటి ఆదరణ ఉందో అందరికీ తెలిసిందే. అనేక సందర్భాల్లో ఆపిల్ వాచ్‌లు అనేక మంది ప్రాణాలను కాపాడాయి. అందుకనే ఆ వాచ్‌కు అంతటి క్రేజ్ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన ఆపిల్ వాచ్ మోడల్స్ చతురస్రాకారంలో ఉండగా, ఇకపై ఈ తరహా డిజైన్‌కు ఆపిల్ ముగింపు పలుకుతున్నట్లు తెలిసింది. ఎందుకంటే.. త్వరలో రానున్న ఆపిల్ వాచ్ 6 చతురస్రాకారంలో కాక వృత్తాకారంలో ఉంటుందని తెలిసింది.
ఆపిల్ వాచ్ సిరీస్ 6 స్మార్ట్‌వాచ్‌లను ఆపిల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ వాచ్‌కు చెందిన పలు ఇమేజ్‌లు, స్పెసిఫికేషన్లు నెట్‌లో లీకయ్యాయి. ఈ క్రమంలోనే వాచ్ 6లో ఆపిల్ వృత్తాకార డిస్‌ప్లేను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. అలాగే డిస్‌ప్లే కింది భాగంలో ఫ్లెక్సిబుల్ సర్క్యూట్ బోర్డులను అమరుస్తున్నట్లు సమాచారం. ఇక గతంలో వచ్చిన వాచ్‌ల కన్నా వాచ్ 6 మరింత ఎక్కువ వాటర్ ప్రూఫ్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుందని తెలిసింది.
ఇక వాచ్ 6లో మైక్రో ఎల్ఈడీ ప్యానెల్‌ను ఆపిల్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అలాగే డిస్‌ప్లే సైజ్‌ను కూడా కొద్దిగా పెంచుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆపిల్ వాచ్ 6 ఎలా ఉండబోతుందనే విషయాన్ని గ్రహించి దాన్ని ఊహించి కొందరు ముందుగానే ఇమాజినేటివ్ ట్రైలర్‌ను విడుదల చేశారు. అందులో ఆపిల్ వాచ్ 6 ఎలా ఉంటుందనే విషయాన్ని గ్రాఫిక్స్‌లో చూపించారు. అయితే నిజంగానే ఆపిల్ వాచ్ 6 రౌండ్ డిస్‌ప్లేతో ఉంటుందా, లేక పాత వాచ్‌ల డిజైన్‌నే అందులోనూ ఇస్తారా.. అన్న వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది..!