తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రొటెం చైర్మెన్ ఈ రోజు నియమించనున్నారు. ఇప్పటి వరకు కూడా శాసన మండలి ప్రొటెం చైర్మెన్ గా భూపాల్ రెడ్డి ఉన్నారు. అయితే ఆయన ఎమ్మెల్సీగా పదవీకాలం మంగళ వారం నాటికి ముగిసింది. దీంతో కొత్తగా ఈరోజు ప్రొటెం చైర్మెన్ నియమిస్తారు. ఈ రోజు నియమించే ప్రొటెం చైర్మెన్ పూర్తి కాలం చైర్మెన్ ను ఎన్నుకునే వరకు ఉంటారు. అయితే సాధారణంగా ప్రొటెం చైర్మెన్ ను హౌస్ లో ఎక్కువ సీనియారిటీ ఉన్న వాళ్లు కు మాత్రమే దక్కుతుంది.
అందు వల్ల నిజమాబాద్ జిల్లా కు చెందిన వీజీ గౌడ్ తో పాటు డీ. రాజేశ్వర్ రావు లలో ఒకరికి ప్రొటెం చైర్మెన్ పదవీ దక్కే అవకాశం ఉంది. వీరిలో డీ.రాజేశ్వర్ రావుకు ప్రొటెం చైర్మెన్ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజేశ్వర్ రావు 2007 నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. వీజీ గౌడ్ 2011 నుంచి ఎమ్మెల్సీ గా కొనసాగుతున్నారు. కాగ ఈ రోజు ప్రొటెం చైర్మెన్ పై నిర్ణయం తీసుకుని గవర్నర్ తమిళసై కు సిఫార్సు చేస్తారు. అయితే మంగళ వారం నాడు భూపాల్ రెడ్డితో పాటు మరో 11 మంది ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. అయితే అందులో ఏడుగురు తిరిగి ఎన్నికయ్యారు.