సామాన్యులను దోచుకోవడం ఆపండి.. ఆర్జీవీకి పేర్ని నాని కౌంటర్

-

టాలీవుడ్ దర్శకుడు ఆర్జీవీ ట్వీట్‌ కు ఏపీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు ? మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు ? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు? ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించదని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. థియేటర్లలో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని.. ఇది 1970 సినిమాటో గ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెబుతున్నాయని వెల్లడించారు.

ఒక వస్తువుకు సంబంధించిన మార్కెట్‌ ధర నిర్ణయంలో అసలు ప్రభుత్వానికి ఉన్న పాత్ర ఏమిటో సమాధానమివ్వండని అడిగారని… సినిమా ఒక వస్తువు కాదని చురకలు అంటించారు. అది వినోద సేవ మాత్రమేనని… ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని మేం చేస్తున్నది థియేటర్లలో టికెట్‌ ధరల నియంత్రణ మాత్రమే తప్ప, సినిమా నిర్మాణ నియంత్రణ ముమ్మాటికీ కాదు మీకు కింది నుంచి మద్దతు ఇవ్వటానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారని,మీ నెత్తిన ఎక్కి తొక్కటానికి కాదన్నారని సెటైర్ వేశారు. సినిమా టికెట్‌ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు కింది నుంచి బలాన్ని ఇచ్చినట్టు అని…సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించటం సబబేనా వర్మ గారూ ? అని మండిపడ్డారు. కాగా నిన్న ఏపీ సర్కార్ పై వర్మ మండిపడ్డ సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version