స్టంట్ మ్యాన్ మరణంతో అక్షయ్ కుమార్ పై ప్రశంసలు.. అసలు ఏమైందంటే..?

-

ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రి మారన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం విడుతలై.. అయితే ఈ సినిమా షూటింగ్లో భాగంగా 54 సంవత్సరాల వయసున్న ఎస్ సురేష్ అనే ఒక స్టంట్ మ్యాన్ ఓ స్టంట్ చేయాల్సి వచ్చింది. తాడు నడుముకు కట్టుకొని 20 అడుగుల ఎత్తు నుంచి దూకే సన్నివేశంలో సురేష్ గాల్లో ఉండగానే నడుముకు కట్టిన తాడు తెగిపోవడంతో ..కిందపడి గాయాల పాలయ్యాడు. అయితే తీవ్రంగా గాయపడిన సురేష్ అపస్మారక స్థితిలోకి జారుకోవడంతో.. చిత్ర బృందం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.. అయితే ఫలితం లేకపోయింది.. అప్పటికే సురేష్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

సినిమా షూటింగ్లో స్టంట్ మ్యాన్ మృతి పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం .. సురేష్ ట్రైన్ బోగిలపై నుంచి పరిగెడుతూ బ్రిడ్జి పైకి దూకి పరిగెత్తాల్సి ఉంది. ఈ సన్నివేశాన్ని తెరకెక్కించే క్రమంలోనే క్రేన్ కి కట్టిన తాడు తెగిపోవడంతో సురేష్ కింద పడి తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఈయనకి భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం స్టంట్ మ్యాన్ మరణించడంతో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే .. ఇలాంటి ఊహించని ప్రమాదాలు షూటింగ్ సమయంలో జరిగినప్పుడు స్టంట్స్ మ్యాన్ కుటుంబాలు నష్టపోకుండా ఉండడం కోసం వారికి ముందుగానే ఇన్సూరెన్స్ చేయించే పద్ధతిని గతంలో అక్షయ్ కుమార్ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ప్రారంభించిన ఆ ఇన్సూరెన్స్ పద్ధతిని సినీ పరిశ్రమ వర్గాలు మరోసారి గుర్తు చేసుకుంటున్నాయి. అలా ఇన్సూరెన్స్ చేయిస్తే ఇలాంటి ఊహించని సంఘటన జరిగినప్పుడు వారి కుటుంబాలకు భరోసా ఉంటుందని కొంతమంది స్టంట్ మ్యాన్ లు కూడా చెప్పుకుంటున్నారు. మరి అక్షయ్ కుమార్ ప్రవేశపెట్టిన ఈ ఇన్సూరెన్స్ పద్ధతి అనేది ఎంతో మంది కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version