RTC బస్సులో తండేల్ సినిమా ప్రదర్శించడంపై ఏపీ చైర్మన్ కొనకళ్ళ స్పందించారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సులో తండేల్ సినిమా ప్రదర్శించడంపై ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ సీరియస్ అయ్యారు. ఎందుకు ప్రదర్శించారు, ఇందులో ఎవరి ప్రమేయం ఉంది అనే దానిపై విచారణకు ఆదేశించారు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ.
పలాస నుంచీ విజయవాడ వచ్చే పలాస డిపో ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సులో ప్రదర్శించినట్టు గుర్తింంచారు. బస్సు డ్రైవర్లను, బస్సును నిలిపివేసి విచారణకు ఆదేశించారు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ. పలాస డిపో మేనేజర్, అసిస్టెంట్ డిపో మేనేజర్ లతో విచారణకు కమిటీ ఏర్పాటు చేశారు. ఇక ఈ సంఘటనపై వెనుక ఉన్న వారిపై యాక్షన్ తీసుకోనున్నారు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ. అటు తండేల్ సినిమా బృందం కూడా దీనిపై సీరియస్ గా ఉంది.