అయ్యప్ప భక్తులకి ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం కేరళలోని శబరిమలై కు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ ఈడి రమేష్ కుమార్ ప్రకటించారు. అంతే కాదు చార్జీలు కూడా సాధారణంగానే ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
కరోనా సమయంలో ఏపీఎస్ఆర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లిందన్న ఆయన అయినా ఆయప్ప భక్తుల కోసం తాము ఆ నష్టాన్ని లెక్కలోకి తీసుకోకుండా సాధారణ ఛార్జీల తోనే యాత్రికుల సౌకర్యం కోసం బస్సులు నడుపుతున్నామని తెలిపారు. ఇక శబరిమల యాత్ర తోపాటు పంచారామ క్షేత్ర దర్శిని కోసం కూడా బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.