దేశంలోనే ఆక్వా హబ్ గా ఏపీ..!

-

ఈరోజు క్యాబినెట్ మీటింగ్ లో పలు విషయాలు మీద చర్చించబోతున్నారు. ఈ క్యాబినెట్ మీటింగ్ లో చర్చించిన అంశాలు ఇప్పటికే వెలుగు లోకి వచ్చాయి. వైద్య, ఆరోగ్య రంగంలో నాడు నేడు పథకం అమలు చేశామని ఉప ఆరోగ్య కేంద్రాల నుండి బోధన్ ఆసుపత్రులు దాకా 16852 కోట్లు వ్యయం చేశామని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ అని వినూత్న కార్యక్రమం ద్వారా ప్రజలకు అందుబాటులోకి వైద్యం ఉండేటట్టు చేసామని చెప్పడం జరిగింది.

53.58 లక్షల మంది రైతులకి 33300 కోట్ల రూపాయల మేర రైతు భరోసా ఆర్థిక సహాయాన్ని అందించమని జగన్ అన్నారు. 10778 రైతు భరోసా కేంద్రాలు వన్ స్టాప్ సెంటర్లుగా ఏర్పాటు చేశామని అన్నారు 3000 కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆక్వా ఉత్పత్తిని పెంచేలా 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టామని 2000 కి పైగా ఫ్రెష్ ఆంధ్ర రిటైల్ దుకాణాలు స్థాపించమని దేశంలోనే ఏపీ ఆక్వా హబ్ గా తయారైందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news