సీఎంలలో తోపు మన యోగి ఆదిత్యనాథ్

-

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి వార్తల్లో నిలిచారు.భారత దేశంలో అత్యంత పాపులర్‌ సీఎంగా ఆయన రికార్డ్ నెలకొల్పారు.ఎక్స్ ఖాతాలో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న సీఎం గా ఆయనకు గుర్తింపు దక్కింది.ఎప్పుడూ ఏదో ఒకవిధంగా వార్తల్లో నిలిచే యోగి మరోసారి ఇలా అత్యంత ఆదరణ కలిగిన నేతగా నిలిచారు. భారత్‌లో ఇతర సీఎంలకంటే అధికంగా ఎక్స్ ఖాతాలో ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ఇటీవలే ఆయన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య 27.4 మిలియన్ మార్కు దాటింది.

యోగి అదిత్యనాథ్ తరువాత స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. కేజ్రీవాల్ వ్యక్తిగత ఎక్స్ అకౌంట్‌ను 27.3 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. 24.8 మిలియన్ ఫాలోవర్లు ఉన్న రాహుల్ గాంధీ కంటే యోగి ముందే ఉన్నారు. ఇక యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు 19.1 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. యోగి వ్యక్తిగత అకౌంట్‌తో పాటూ ఆయన వ్యక్తిగత ఆఫీస్ అకౌంట్‌ను కూడా నెటిజన్లు పెద్ద సంఖ్యలో అనుసరిస్తున్నారు. కోటి మందికి పైగా ఆఫీస్ అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు.

ధార్మిక కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని అన్నివిధాలుగా అభివృధిపథంలో నడుపుతున్నారు.అటు లా అండ్ ఆర్డర్ నిర్వహణలో కూడా సీఎం యోగి వేగంగా నిర్ణయాలు తీసుకుంటారని పేరుంది. చట్టాలను ఉల్లంఘించే వారిని ఆయన అస్సలు ఉపేక్షించరని బీజేపీ వర్గాలు,అక్కడి ప్రజలు కూడా చెబుతున్నాయి. మహిళలు గౌరవంగా బ్రతుకుతున్నారంటే కేవలం యోగి చలువే అని వేనోళ్ళ కొనియాడుతున్నారు.ఈ తరహా పాలనకు యోగి మోడల్ అని కూడా ఎప్పుడో నామకరణం చేశారు. మరోవైపు, రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అయోధ్యలో చేసిన ఏర్పాట్లపై కూడా సర్వత్రా ప్రశంసలు వచ్చాయి.ప్రతి పనిలో తన మార్కును స్పష్టంగా చూపిస్తున్న యోగి మరింతగా జనాదరణ పొందాలని,భావిభారత ప్రధానిగా చూడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news