దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ గెలిచింది అనగానే జాతీయ మీడియా రాసిన వ్యాఖ్య ఏంటో తెలుసా…? మధ్యతరగతి ప్రజలు మొత్తం ఆప్ ని గెలిపించారు అని. అవును మధ్య తరగతి ప్రజలు మొత్తం ఆప్ కే ఓటు వేసారు. ఎందుకో తెలుసా…? సాధారణంగా ముఖ్యమంత్రి అంటే ఏ విధంగా ఉంటాడు…? చుట్టూ భారీ భద్రత. కనీసం అతని వద్దకు వెళ్ళాలి అంటేనే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది.
కాని అరవింద్ కేజ్రివాల్ వ్యవహారం అలా ఉండదు. రోడ్ల మీదకు ఒక్కరే నడిచి వచ్చేస్తారు. నన్ను ఎవరో చంపేస్తారు అనే భయం అతనిలో ఏ కోశానా ఉండదు. ఐపిఎస్ ఆఫీసర్ నుంచి దేశ రాజధాని ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రతీ ఒక్కటి అయన స్టైల్ వేరు. అత్యంత సామాన్యుడు. హడావుడి ఉండదు, ఇంటి పక్కన అంకుల్ ఎలా ఉంటారో ఆయన అలాగే ఉంటారు. హడావుడి ఎక్కడా ఉండదు.
బయటకు వస్తే మందీ మార్భాలం ఉండదు. ప్రజలకు ఎం కావాలో తెలుసు. మధ్యతరగతి జీవనం ఎక్కువ మన దేశంలో వాళ్లకు ఎం కావాలో ఆయనకు తెలుసు కాబట్టే విద్యుత్, గ్యాస్, మెట్రో రైలు, బస్ ప్రయాణం ఇలా ఎన్నో ఫ్రీ అంటూ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఇంటింటికి మంచి నీళ్ళు ఇవ్వడంతో పాటుగా సరిబేసి విధానంతో కాలుష్య నియంత్రణకు ఆయన శ్రీకారం చుట్టారు.
బిజెపి ఎన్ని విమర్శలు చేసినా ఎందరు ఎన్ని అన్నా సరే ఆయన మాత్రం తన స్టైల్ వదిలిపెట్టలేదు. తాను చెయ్యాలి అనుకున్నది, కాదు కాదు ఢిల్లీ వాలో ఎం కోరుకుంటున్నారో చేసారు, చేసి చూపించారు. బిజెపి చెప్పే కబుర్లు జనాల్లోకి వెళ్ళినా, అది కేజ్రీ ఓటు బ్యాంకు ని దెబ్బ తీయలేదు. కులాలతో సంబంధం లేకుండా ఆయన ప్రజల్లోకి వెళ్ళారు. అవును దేశ రాజధాని పీఠం మీద కూర్చుంది ఒక సామాన్యుడు.
ఆప్ ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఎవరూ కూడా అవినీతి చేసే అవకాశం లేకుండా పోయింది. వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి ఎక్కడా భయపడరు. ఉదయం వాకింగ్ కి వెళ్ళిపోతారు. ప్రజలతో మాట్లాడతారు. ఎవరైనా ఆయన దగ్గరకు రావొచ్చు. ఇబ్బంది ఏమీ ఉండదు. ప్రజలకు పరిపాలన అందింది. దేశభక్తి, మరొకటి లాంటి అనవసరమైన విషయాలతో ఢిల్లీ ప్రజలకు పని లేదు. ఎందుకంటే విద్యావంతులు కదా…?