రామ్ చరణ్- సమంత ఈ జోడీ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ‘రంగస్థలంస సినిమానే. ఈ చిత్రంలో చిట్టిబుబాబుగా రామ్ చరణ్, ఆయన ప్రేయసి రామలక్ష్మిగా సమంత ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిలా నిలిచేలా నటనా ప్రతిభ కనబర్చారు. అయితే ఇప్పుడు ఇదే ఇక ఇలాంటి సంచలన కాంబినేషన్ ఇప్పుడు మళ్లీ రిపీట్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ఒక భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో చరణ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడనీ, ఆ పాత్ర నిడివి 30 నిమిషాలకి పైగా ఉంటుందని అంటున్నారు.
అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు రామ్ చరణ్- సమంత జోడీకి ఉన్న క్రేజ్ కూడా యాడ్ కావాలని కొరటాల ప్లాన్ చేశారట. వాస్తవానికి రామ్ చరణ్ జోడీ కోసం ముందుగా కియారా అద్వానీని తీసుకోవాలని అనుకున్న కొరటాల.. పలు కారణాల వల్ల చివరకు సమంతను ఫైనల్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు ఈ మెగా 152లో చిరంజీవి సరసన త్రిష నటిస్తుండి. ఇకత్వరలో మొదలయ్యే రాజమండ్రి షెడ్యూల్లో ఆమె జాయిన్ కానుందని అంటున్నారు. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. కాగా, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.