ఓ వయసుకు వచ్చిన తర్వాత అమ్మాయిలు, అబ్బాయిలలో చాలా మార్పు వస్తుంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సులభంగా ఇతరులకు ఆకర్షితులవుతారు. చాలా సినిమాల్లో కూడా మనం అబ్బాయిల అమ్మాయిల ప్రవర్తనని చూసాము. కాలేజీకి వెళ్లే వాళ్ళు లేదంటే టీనేజర్స్ ఈజీగా ఒకరికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అయితే ఎక్కువగా ఇబ్బంది పెట్టే వాళ్లను అమ్మాయిలు ఇష్టపడుతూ ఉంటారా..? అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా చూసిన స్టడీ ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టింది ఇటీవల చేసిన అధ్యయనంలో కొంతమంది అమ్మాయిలు తమతో సరిగ్గా ప్రవర్తించని హింసాత్మక వైఖరి ఉన్న వాళ్ల గురించి తెలుసుకోవడానికి 59 మంది అబ్బాయిలను 71 అమ్మాయిలను తీసుకున్నారు.
వీళ్ళ వయసు 15 లేదా 16 ఏళ్లు మాత్రమే. అయితే ఎవరైతే పదేపదే అమ్మాయిలను ఏడిపించడం లేదంటే కాస్త విచిత్రమైన ప్రవర్తనతో ఉంటారో వాళ్ళ పట్ల అమ్మాయిలు ఆకర్షితులైనట్లు తెలుస్తోంది. ఇటువంటి రకమైన అబ్బాయిలు మళ్ళీ ఇష్టపడినట్లు స్టడీ ద్వారా తెలుస్తోంది. భయంకరమైన రిలేషన్ షిప్ లోకి అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు. హింసాత్మకమైన ప్రవర్తన కలిగిన వాళ్లకు ఇట్టే అమ్మాయిలు ఆకర్షితులు అవుతున్నారని అలాంటి వాళ్ళతో భయంకరమైన రిలేషన్షిప్ లో ఉంటున్నట్లు స్టడీ చెప్తోంది.
సరిగ్గా ఆమెతో ప్రవర్తించకపోవడం, కోపంగా ఉండడం, భయంకరమైన ప్రవర్తన కలిగి ఉండడం పట్ల అమ్మాయిలు ఆకర్షితులవుతున్నారట. అలాగే చాలామంది అమ్మాయిలు భయంతో లేదా ఒత్తిడి కారణంగా ప్రేమలో పడుతున్నారట. స్నేహితులని కోల్పోతామేమో అని భయపడుతున్నారట. అలా రిలేషన్షిప్ వద్దనుకున్నా ఈ కారణాల వలన ఆ ప్రేమలో పడుతున్నారని స్టడీ చెప్తోంది.