ఆ ముగ్గురు నా ఫేవరెట్ క్రికెటర్స్ : మను బాకర్

-

పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి ఘనత సాధించిన భారత స్టార్ షూటర్ మను బాకర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆమె బ్రాండ్‌ వాల్యూ భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె పలు ఈవెంట్లకు హాజరవుతూ.. ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది. తాజాగా మను.. క్రికెట్‌లో తనకు ఇష్టమైన ముగ్గురు క్రికెటర్ల పేర్లను చెప్పింది. మరోవైపు ఓ ఇంటర్నేషనల్ అథ్లెట్ జీవితం తనకెంతో స్ఫూర్తినిస్తుందని చెప్పుకొచ్చింది.

తనకు చాలా మంది క్రీడాకారులు అంటే ఇష్టమని చెబుతూ.. అందులో కొందరు మాత్రం చాలా చాలా చాలా ఇష్టమంటూ వారి పేర్లను బయటపెట్టింది మను. ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టార్ రన్నర్.. జమైకా స్టార్ హుసేన్ బోల్ట్ తన ఫేవరెట్ అని తెలిపింది. ఆయన జీవిత చరిత్ర పుస్తకం చదివానని. ఆయన ఇంటర్వ్యూలు కూడా చాలా చూశానని మను బాకర్ వెల్లడించింది. ఆయన జర్నీ చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుందని పేర్కొంది. ఇక భారత్లో సంచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ అని వాళ్లతో ఓ గంట పాటు టైం స్పెండ్ చేస్తే చాలు ఎంతో ప్రేరణగా అనిపిస్తుందని చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news