Rajinikanth counter to Vijay: రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిది...ఎలాంటి తుఫానునైనా ఎదుర్కొంటుందని తెలిపారు. డీఎంకే మర్రి చెట్టును ఎవరూ కదిలించలేరని తెలిపారు. మంత్రి ఎ.వి.వేలు రచించిన ‘కళైంజ్ఞర్ ఎనుమ్ థాయ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నటుడు రజనీకాంత్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. రాజకీయాల గురించి మాట్లాడితే జాగ్రత్తగా ఉండాలి. విమర్శలు ఇతరులను బాధించకూడదని తెలిపారు.

కళాకారుడు కరుణానిధి ఎదుర్కొన్న సమస్యలు మరెవరికైనా జరిగి ఉంటే కనుమరుగయ్యేవారు..కరుణానిధి సమాజం, ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారన్నారు. రాజనాథ్ సింగ్ కరుణానిధి గురించి అరగంట ఆయన ఒక్కడే మాట్లాడినట్టు కాదు పైనుంచి ఆర్డర్ వస్తేనే ఆయన అంతలా మాట్లాడి ఉంటారని తెలిపారు. సీనియర్లను హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు కానీ స్టాలిన్ సమర్థవంతంగా ఆ పని చేస్తూ ఉన్నారు… వరుసగా పార్టీకి విజయాలను తీసుకుని వస్తున్నారు ఆయనకు నా అభినందనలు అని తెలిపారు. అయితే.. విజయ్‌కొత్త పార్టీ పెట్టిన తరునంలో…ఆయనకు కౌంటర్ గా రజినీ కాంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు.