సింగర్ చిన్నయ్ – సమంత మధ్య విభేదాలు ఉన్నాయా..?

-

దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏ మాయ చేసావే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత.. తనదైన నటనతో తన మార్క్ ఏంటో చూపించింది. ఇక తొలి మూవీతోనే జెస్సీగా కనిపించి ప్రేక్షకులను తన మాయలో పడేసింది. హస్కీ వాయిస్ తో సమంత ఈ మూవీలో మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రేక్షకులను హత్తుకుంది. దీంతో అంతా సమంతను ఓన్ చేసుకుని.. క్రేజీ స్టార్ ను చేసేసారు. అయితే ఈ వాయిస్ సమంతది కాదు సింగర్ చిన్మయ్ దన్న విషయం తెలిసిందే. ఇక సమంత బాడీ లాంగ్వేజికి చిన్మయి స్వరం యాడ్ అవ్వడంతో గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు, తమిళ్ ప్రేక్షకులను సమంత మెస్మరైస్ చేస్తూ వస్తోంది. ఇకపోతే తాజాగా మహానటి నుంచి చిన్న చిన్నగా చిన్మయి ను అవాయిడ్ చేస్తూ తన స్వరాన్ని వినిపిస్తూ వస్తోంది సమంత.

కానీ పూర్తి స్థాయిలో మాత్రం తన గొంతుతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయలేకపోతోంది. దీంతో సమంత.. చిన్మయి ను ఎందుకు దూరం పెడుతుందని ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు ..అంతేకాదు వీరిద్దరి మధ్య దూరం పెరగడానికి కూడా కారణం ఏమిటన్నది మాత్రం ఇంతవరకు బయటకు రాలేదు. ఇదిలా ఉండగా యశోద మేకర్స్ మాత్రం సమంతకు చిన్మయి చేత డబ్బింగ్ చెప్పాలని చూస్తున్నారట. కానీ సమంత మాత్రం లేదు తానే చెబుతానని అంటుందట. ఇక ఈ కారణంగానే యశోద సినిమా రిలీజ్ డిలే అవుతున్నట్లుగా సమాచారం. ఇకపోతే వెంటనే యశోద డబ్బింగ్ పనులు పూర్తి చేస్తానని చిత్ర బృందానికి చెప్పేసిందట సమంత.

కానీ మేకర్స్ మాత్రం చిన్మయి తోనే డబ్బింగ్ చెప్పించాలని పట్టుబడుతుంటే .. తాను వద్దని తన పాత్రకు తాను డబ్బింగ్ చెప్పుకుంటానని కూడా చెబుతోందట. దీన్ని బట్టి చూస్తే వీరిద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు ఉన్నాయేమో అంటూ అనుమానాలు కూడా మొదలయ్యాయి. మరి ఈ విషయంపై సమంత ఎలా వివరణ ఇస్తుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news