ప్రతి ఒక్కరు కూడా ఇంటిని చాలా అందంగా క్లీన్ చేసుకుంటూ వుంటారు. అయితే ఇంట్లో ఈగలు వస్తూ ఉంటాయి ఈగలు వలన చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంట్లో ఈగలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవడానికి కష్ట పడుతూ ఉంటారు. మీ ఇంట్లో కూడా ఈగలు ఎక్కువగా ఉన్నట్లయితే ఇలా చేయండి. వెంటనే ఈగలు పారిపోతాయి. ఈగల కారణంగా కలరా, విరోచనాలు, టైఫాయిడ్, డెంగ్యూ వంటి సమస్యలు కలుగుతాయి.
శుభ్రత పాటించినప్పటికి ఒక్కొక్కసారి ఈగలు వస్తూ ఉంటాయి. ఈగలు బాధ నుండి బయట పడాలంటే అల్ట్రా వైయొలెన్ట్ ట్రాక్స్ ని వాడొచ్చు ఈ ట్రాప్స్ వలన ఈగలు అందులో పడి చనిపోతాయి. అల్ట్రా వైయొలెన్ట్ ట్రాప్ ఈగల్ని బాగా ఆకర్షిస్తుంది. అవి అందులోకి వెళ్ళగానే పడి చనిపోతాయి.
కర్పూరం కూడా బాగా పనిచేస్తుంది. కర్పూరం వాసనకి ఈగలు పోతాయి. తులసి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది తులసి వాసనకి కూడా ఈగలు పారిపోతాయి. తులసి ఆకులని పుదీనా లావెండర్ ఆకుల్ని కూడా మీరు ఈగలను తరిమికొట్టడానికి వాడొచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్ ని మీరు ఒక జార్లో పోసి పెడితే ఈగలు ఆ వాసనికి రావు. డిష్ వాషింగ్ లిక్విడ్ తో పాటుగా కొంచెం వైట్ వైన్ ని వేసి ఒక చిన్న గిన్నెలో వేస్తే ఈగలు అందలో పడి చనిపోతాయి ఇలా సులభంగా ఈగలుని తరిమికొట్టొచ్చు. మీ ఇంట్లో ఈగలు లేకుండా చేయొచ్చు.