ఈ అలవాట్లు ఎక్కువగా ఉన్నాయా? అయితే అక్కడ వీక్ అవుతారు..

-

శృంగారం గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి.. ఒకప్పుడు సిగ్గు పడేవాల్లు ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రోజుల్లో యువతకు ఇలాంటి విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అయితే శృంగార సామర్థ్యం పెరగాలంటే, లేదా లైంగిక సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని అలవాట్లకు దూరంగా వుండాలని సెక్స్ నిపుణులు అంటున్నారు.. ఇలాంటి విషయాల్లో ఆలస్యం ఎందుకు త్వరగా ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

* రోజూ వింటున్న విషయమే.. ప్యాకెజ్డ్ ఫుడ్ ఐటమ్స్ కు కూడా దూరంగా ఉండాలని చెబుతున్నారు.. వీటి వల్ల లైంగిక సమస్యలు మాత్రమే కాదు.. మరెన్నో వ్యాధులకు కూడా కారణం అవుతుంది.

* ఇక మధ్యపానం, దూమపానం చెయ్యడం వల్ల అక్కడ రెచ్చిపోతారని చాలా మంది అనుకుంటారు. కానీ అది ఏమాత్రం నిజం కాదు.. వాటిని తీసుకోవడం వల్ల లైంగిక హార్మొన్లు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు..

* ఊబకాయం, అధిక బరువు సమస్యలతో బాధపడేవారు కూడా లైంగిక రుగ్మతలకు గురవుతారు. ముఖ్యంగా అంగస్తంభన సమస్యకు గురవుతారని అంటున్నారు.

* ఒత్తిడి.. ఇది ఈ పెద్ద సమస్య.. ఎక్కువ అయితే లైంగిక సమస్యలు వస్తాయట. అంతేకాదు సంతానొత్పత్తి కూడా తగ్గే అవకాశం ఉందని తెలుస్తుంది.

లైంగిక సామర్థ్యాన్ని పెంచే మార్గాలు ఏంటంటే..

* లైంగిక ఆరోగ్యం అనేది మానసిక ఆరోగ్యం తో ముడిపడి ఉంటుంది. కాబట్టి లైంగిక విషయాన్ని తరచూ భాగస్వామి తో చర్చించడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది..

* బీపీ, షుగర్ ఉన్నవారి నరాలు దెబ్బతింటాయి. అలాగే అంగానికి రక్తప్రసరణ లో ఆటంకం ఏర్పడుతుంది. సో ఇలాంటి వారు ప్రతిరోజూ వ్యాయామం, మెడిటేషన్ వంటి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు…

Read more RELATED
Recommended to you

Exit mobile version