ఈ స్టార్స్ కలిసి సినిమా చేయబోతున్నారా..?!

-

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఇద్దరి స్టార్ హీరోల రూటే సపరేటు. ఇద్దరికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్. అయితే ఈ ఇద్దరు కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో తెగ వైరల్ అయి చక్కర్లు కొడుతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందనే వార్త ప్రేక్షకులను సంతోషంలో ముంచేస్తోంది.

pavan-and-mahesh

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖానికి రంగులద్దుకుని ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ ను మరోసారి వెండి తెరపై చూడాలనే ఆశతో సినీ ప్రేమికుల కోరికను మన్నిస్తూ ఆయన వరుస ప్రాజెక్టులకు ఓకే చేసేశారు. సినిమాకు ఓకే చెప్పడంతో పవర్ స్టార్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.

మరోవైపు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఈ ఏడాది ప్రారంభంలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈ ఇద్దరి స్టార్ హీరోల కాంబినేషన్ లో సినిమా రావాలని అటు ప్రేక్షకులు, ఇటు అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే పవన్-మహేశ్ ఇద్దరు కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-సూపర్ స్టార్ మహేశ్ బాబు కలిసి వెండితెరపై సందడి చేయనున్నారు. కాకపోతే, అది పూర్తిస్థాయిలో కాదంట.. కేవలం కొంతసేపటి మాత్రమేనట. మహేశ్ బాబు హీరోగా తెరకెక్కనున్న ‘సర్కారువారి పాట’ సినిమాలో పవన్ కళ్యాణ్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. కేవలం ఐదు నిమిషాల వరకు మాత్రమే స్క్రీన్ పై కనిపిస్తారు. దీనికి సంబంధించిన పలు పోస్టర్లు, పోస్టులు ఆన్ లైన్ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అభిమానుల కల త్వరలో నిజం కాబోతుంది. కాగా, గతంలో పవన్ కళ్యాణ్ నటించి ‘జల్సా’ సినిమాకు మహేశ్ బాబు వాయిస్ ఓవర్ అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version