రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక అంతా వాట్సాప్ లోనే ?

-

రైల్వే ప్రయాణికులకు శుభవార్త. అదేంటంటే ఇక మీదట వాట్సాప్ లోనే రియల్‌ టైమ్ పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు. రైలోఫీ అనే సంస్థ తాజాగా కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ట్రైన్ జర్నీ చేసే వారికి ఇది చాలా ఉపయుక్తంగా ఉండనుంది. బెనిఫిట్ కలుగనుంది. పీఎన్ ఆర్ మాత్రమే కాక ట్రైన్ ఎక్కడ ఉంది అనేది కూడా సులభంగానే తెలుసుకునే ఛాన్స్ ఉంది. ఈ ఫెసిలిటీ ద్వారా లైవ్ ట్రైన్ స్టేటస్, ప్రీవియస్ స్టాప్, అప్‌కమింగ్ స్టాప్ వంటి సమాచారం అంతా మీ వాట్సాప్ లో తెలుసుకోవచ్చు.

అంతే కాదు వాట్సాప్ ద్వారా పీఎన్ఆర్ స్టేటస్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇక ఈ ఫెసిలిటీ పొందాలి అంటే కనుక వాట్సాప్ యూజర్లు రైలోఫీ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. తర్వాత +91-9881193322 నెంబర్‌ ను ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. అలా సేవ్ చేసుకున్నాక వాట్సాప్‌ లోకి వెళ్లి మీ 10 అంకెల పీఎన్ఆర్ నెంబర్‌ను ఎంటర్ చేసి ఆ వాట్సాప్ నంబర్ కు సెండ్ చేయాలి. తర్వాత మీకు మీ జర్నీకు సంబందించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు రియల్‌టైమ్‌లో వస్తూ ఉంటాయి.  

Read more RELATED
Recommended to you

Exit mobile version