మాల్స్ లో షాపింగ్ చేస్తున్నారా?వీటి గురించి తప్పక తెలుసుకోవాలి..

-

మన అవసరాలకు కావలసిన అన్ని వస్తువులు పెద్ద పెద్ద మాల్స్ లో ఈజిగా దొరుకుతాయి.. అందుకే రేటు ఎక్కువైనా ఫర్వాలేదు అన్నీ ఒకే చోట ఉంటాయని జనాలు వాటి వైపు పరుగులు తీస్తున్నారు.పది వస్తువుల కోసం పది దుకాణాలు తిరిగే రోజులు పోయి ఏమి కావల్సిన మాల్స్ కు వెళ్లడం అలవాటుగా మారిపోయింది.

మొదట్లో ఎక్కువ సంపాదన ఉన్న వాళ్లు మాత్రమే మాల్స్ కు వెళ్లి షాపింగ్ చేసేవారు. కాని పరిస్థితులు మారిపోయాయి. ఇదో ఫ్యాషన్ గా మారడంతో వేతన జీవులు కూడా ఇప్పుడు మాల్స్ లో షాపింగ్ కు అలవాటు పడ్డారు. అంచనాకు మించిన షాపింగ్ తో నెల తిరగకుండానే ఆదాయం ఖర్చు అయిపోవడంతో నెల మధ్యలోనే ఆర్థిక ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ముఖ్యంగా మాల్స్లో ఆఫర్లకు ఆకర్షితులై మనకు ఆ సమయంలో అవసరం లేని వస్తువులను కూడా కొనుగోలు చేస్తుండటంతో డబ్బులు వృధా అవుతున్నాయి. మొదట మన బడ్జెట్ ను అంచనా వేసుకుని మాల్స్ లో షాపింగ్ కు వెళ్తే.. షాపింగ్ పూర్తై బిల్లింగ్ కౌంటర్ వద్దకు వచ్చే సరికి బిల్లు చూసి షాక్ అవ్వడం సాధారణ మనిషి వంతు అవుతుంది. దీనికి కారణం మనం ఏం కొనాలో అనే సరైన అంచనా లేకుండా వెళ్లడమే..

మనం ఏ వస్తువులు కొనుగోలు చేయడానికి వెళ్తున్నామో షాపింగ్ కు ముందు డిసైడ్ చేసుకోవాలి. ముఖ్యంగా నిత్యావసర, కిరణా వస్తువులు కొనడానికి వెళ్తున్నప్పుడు ముందుగానే లిస్ట్ తయారుచేసుకోవాలి. ఆ లిస్టు ప్రకారం మనకు కావల్సిన వస్తువులను కొనుగోలు చేస్తే మనం అనుకున్న బడ్జెట్ లో షాపింగ్ పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా వస్తువుపై ఉన్న ఆఫర్ మిమల్ని ఆకర్షిస్తే, ఆ వస్తువు మీకు ఎంత వరకు అవసరం, అది కొనడం ద్వారా మీకు ఆ వస్తువు ఎంత మేర ఉపయోగపడుతుందనేది డిసైడ్ చేసుకోవాలి.

అందుకే షాపింగ్ కు పరిమితి విధించుకోవడం మంచిది. ఏదైనా మధ్యలో ముఖ్యమైన సామాగ్రి అవసరం అయితే స్థానికంగా మన చుట్టుపక్కల ఉండే దుకాణాలకు వెళ్లి కొనుక్కోవడం ఉత్తమం.డిస్కౌంట్లు చూసి, బయట కిరాణా దుకాణంతో పోలిస్తే కిలోకు రెండు నుంచి ఐదు రూపాయల వరకు తగ్గింపు ఉండొచ్చు పరిస్థితులను బట్టి. అయితే అదే సందర్భంలో నాణ్యతను చూసుకోవల్సి ఉంటుంది. మాల్స్ లో లభించే ధరలతో పాటు నాణ్యతను కూడా చెక్ చేసుకోవల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం చేసే షాపింగ్ మీద మాల్స్ కు, కిరణా దుకాణానికి రేట్లలో ఎంత మేర తేడా ఉందనేది గమనించుకోవాలి..ప్రతి దానిని గమినించి కొనడం అలవాటు చేసుకొవాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version