స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరిపై జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.ఇటీవల దేవాదులా ప్రాజెక్టుకు సృష్టికర్తను తానేనని కడియం శ్రీహరి చెప్పడాన్ని పల్లా రాజేశ్వర్ రెడ్డి తప్పుబడుతూనే శుక్రవారం కౌంటర్ ఇచ్చారు.
నేడు పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘పదేళ్లు పదవి లేకుండా ఉన్న నువ్వెలా దేవాదుల సృష్టికర్త అవుతావు. నువ్వు టీడీపీలో ఉండగా తెలంగాణ ప్రాంతంలో ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదు.కేసీఆర్ దయతలచి నిన్ను పార్టీలో చేర్చుకుంటే… వెన్నుపోటు పొడిచి పార్టీ మారావు’ అని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.