అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు.. తినే అన్నానే కాదు.. తినే ప్లేటును కూడా గౌరవించాలి.. చాలా మంది అన్నం తినడంలో తప్పులు చేస్తుంటారు. వాటి వల్ల ఏం జరుగుతుందో కూడా వారికి తెలియదు. అందరూ కామన్‌గా చేసే తప్పు..తిన్న ప్లేట్‌లోనే చేతులు కడగడం. భోజనం చేసేప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి.. అలాగే భోజనం చేసిన తర్వాత కూడా కొన్ని నిమయాలు ఉంటాయి. ఎలా చేయాలు, ఏం చేయొద్దు అనేవి ఒక మనిషిగా మనకు తెలిసి ఉండాలి.. ఎందుకంటే.. మీరు అదే తప్పుకు రోజుకు మూడు సార్లు అంటే జీవితంలో ఎన్ని సార్లు చేస్తున్నారో మీరే అర్థం చేసుకోండి..! కొందరు భోజనం చేసిన వెంటనే ప్లేట్‌లోనే నీటితో చేతులను కడుగుతుంటారు. స్పూన్‌తో తిన్నా సరే కొందరు తిన్న ప్లేట్‌లోనే చేతులను కడుగుతారు. అయితే మన పురాణాలు చెబుతున్న ప్రకారం.. ఇలా చేయడం సరికాదట. అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు.
భోజనాన్ని చేత్తో చేసినా లేదా స్పూన్‌తో తిన్నా.. చేతులను మాత్రం తిన్న ప్లేట్‌లోనే కడగరాదు. ఇలా చేస్తే.. అన్నపూర్ణా దేవితోపాటు లక్ష్మీదేవికి కూడా కోపం వస్తుందట. ఎందుకంటే మనం తినే ఆహారం ఎంతో పవిత్రమైంది. అలాంటి ఆహారాన్ని తిన్న ప్లేట్‌లోనే చేతులను కడగడం అంటే పాపం చేసినట్లే. భోజనం చేశాక ఎట్టి పరిస్థితిలోనూ ప్లేట్‌లో చేతులను కడగరాదు.
అలాగే భోజనం ఉన్న ప్లేట్‌ను కేవలం ఒకే చేత్తో పట్టుకోకూడదు… అలా చేసినా కూడా అన్నపూర్ణా దేవిని, లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతందట. దీంతో వారికి ఆహారం, డబ్బు ఉండదని పండితులు చెబుతున్నారు. కాబట్టి భోజనం విషయంలో ఈ జాగ్రత్తలను తప్పకుండా పాటించాలి.
భోజనం చేసేటప్పుడు భోజనంపైనే దృష్టి పెట్టాలి. పూర్వకాలంలో అయితే కుటుంబ సభ్యులంతా ఒకే దగ్గర కుర్చోని కబుర్లు చెప్పుకుంటూ తినేవాళ్లు.. ఇప్పుడు కూడా డైనింగ్ టేబుల్స్‌పై కుర్చోని తింటున్నారు.. కానీ ఫోన్ లేదా టీవీ చూస్తూ.. కొందరు పుస్తకాలు చదువుతూ తింటారు. ఇలా చేసినా కూడా మనం తినే ఆహారాన్ని అవమానించినట్లే అవుతుందట.
ఈ విధంగా కూడా చేయకూడదు. భోజనం చేసేటప్పుడు ధ్యాస అంతా మనం తినే ఆహారంపైనే ఉండాలి. ఎంతో శ్రద్ధగా, ఎలాంటి కోపం, ఆవేశాలు లేకుండా ప్రశాంతంగా భోజనం చేయాలి. మీరే గమనించండి.. మనం తినేప్పుడు ఎవరైనా వచ్చినా, ఎవరైనా కాల్ చేసినా.. అరే తింటున్నా అంటే.. వాళ్లు సరే తిన్నాక ఫోన్ చేయమంటారు. తిన్నాక రమ్మంటారు.. భోజనం చేసేప్పుడు డిస్టబ్ చేయకూడదని అర్థం.. భోజనాన్ని ఎంత ఇష్టంగా తింటారో అప్పుడే అన్నపూర్ణా దేవి సంతోషిస్తుంది.
మన ఇంట్లో భోజనానికి లోటు లేకుండా చూస్తుంది. దీంతోపాటు ఆర్థిక సమస్యలు కూడా రావు.. కొంతమంది ఇష్టం లేని కూర వండితే.. ముఖం అంతా మాడ్చుకోని చాలా చిరాకుగా తింటారు. ఎందుకట్లా.. అది ఆ పూట మాత్రమే కదా.. రేపు మళ్లీ వేరే కూర వస్తుంది.. ఆ మాత్రం దానికి ఎందుకు ఆస్తులంతా పోయినట్లు బీహేవ్ చేస్తారు. భోజనాన్ని ప్రేమతో, ప్రశాంతంగా, ఏకాగ్రతగా తిన్నవారికే ఏ లోటు లేకుండా ఉంటుందని పండితులు అంటున్నారు. మీరు ఈ తప్పులు చేస్తుంటే ఇక మారండి.! మార్చుకోండి.!