పారితోషికంలో మోనాల్ తో పోట పడిన ఆరియానా.. నిజంగా అంతిచ్చారా..

-

టాప్ 5కి చేరుకున్న ఆరియానా గ్లోరీ, చివరి నామినేషన్లలో ఇంటి నుండి బయటకు వచ్చేసిన మోనాల్ ల పారితోషికాల గురించి అలుపెరగని చర్చ జరుగుతుంది. ప్రేక్షకుల వ్యతిరేకత ఎదుర్కొన్న మోనాల్ ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిందని, కానీ బిగ్ బాస్ యాజమాన్యం కావాలనే ఇన్ని రోజుల పాటు ఆమెని కాపాడిందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఐతే మోనాల్ పారితోషికం సంగతే అందరికీ ఆశ్చర్యం కలిగించేలా ఉంది.

ఒక ఎపిసోడ్ కి 1.25లక్షల వరకు పారితోషికం తీసుకుందట. అంటే ఇప్పటి వరకూ దాదాపుగా కోటికి పైగానే మోనాల్ పాకెట్లోకి వెళ్ళినట్టు లెక్క. అలాగే అసలేమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఆరియానాకి కూడా రెమ్యునరేషన్ దండిగానే అందిందని సమాచారం. రోజుకి 50వేల చోప్పున ఇప్పటి వరకూ 50లక్షల దాకా అందుకుందని చెప్పుకుంటున్నారు.

మోనాల్ హీరోయిన్ గా అంతో ఇంతో అందరికీ పరిచయం ఉంది కాబట్టి అంత పెద్ద మొత్తంలో పారితోషికం అంది ఉండవచ్చు. కానీ బిగ్ బాస్ కి రాకముందు అంతగా తెలియని ఆరియానాకి కూడా ఆ రేంజిలో రెమ్యునరేషన్ అందిందని వార్తలు రావడం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ వార్తలు నిజమా కాదా అన్నది బిగ్ బాస్ కే తెలియాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version