ఒలింపిక్స్ : భారత్ కు నిరాశ.. 4వ స్థానం..!

-

ఒలింపిక్స్ : భారత్ కు నిరాశ.. 4వ స్థానం..!

ఒలింపిక్స్ లో భారత్ మెడల్స్ ఆశలు పెట్టుకున్న షూటింగ్ లో మరో నిరాశ ఎదురైంది అనే చెప్పాలి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో భారత షూటర్ అర్జున బాబుత 4వ స్థానంలో నిలిచి.. మెడల్ కు అడుగు దూరం ఆగిపోయాడు. క్వాలిఫైర్ లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్స్ లో స్థానం సంపాదించిన అర్జున్ పై భారత అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గిన విధంగానే ఫైనల్స్ కు అష్బుతంగా ఆరంభించాడు అర్జున్.

ఈ ఈవెంట్ లో గోల్డ్ గెలిచి చైనా షూటర్ కు పోటీగా మొదటి మూడు స్టేజిలలో రెండో స్థానంలో నిలిచిన అర్జున్.. ఆ తర్వాత ఒత్తిడికి తలొగ్గాడు. రెండో స్థానం నుండి ఒక్కో రౌండ్ లో ఒక్కో స్థానం పడిపోతూ 208.4 పాయింట్స్ తో చివరకు నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అలాగే భారత అథ్లెట్లు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు అనే విషయాన్ని మరోసారి నిరూపించాడు అర్జున్.

Read more RELATED
Recommended to you

Latest news