Arjuna Phalguna : అర్జున ఫాల్గుణ రివ్యూ

-

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే రాజా రాజా చోర అనే డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ప్రామిసింగ్ యాక్టర్ శ్రీ విష్ణు.. ఇప్పుడు అర్జునా పాల్గుణ అనే మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా ఈ సినిమాలో నటిస్తుండగా… మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి మరియు అన్వేష్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్ లు ఈ సినిమాపై అంచనాలు పెంచగా తాజాగా ఆ సినిమా విడుదల అయింది. అయితే.. ఈ సినిమా విడుదల అయ్యాక.. సినిమా పై మిక్సిడ్‌ టాక్‌ వస్తోంది.

కథాంశం : అర్జున ఫాల్గుణ సినిమా గోదావరి జిల్లాల్లోని ఒక గ్రామీణ నిరుద్యోగ యువత కథ. శ్రీవిష్ణు మరియు అతని స్నేహితులు సోడా తయారీ కర్మాగారాన్ని ప్రారంభించాలనుకుంటారు. అయితే.. ఆ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు వారి పోరాటమే ఈ కథ. ఈ నేపథ్యంలో శ్రీవిష్ణు, అతని స్నేహితులు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు (గంజాయి స్మగ్లింగ్) పాల్పడుతారు. అప్పుడు అసలు కథ స్లాట్ ప్రారంభమవుతుంది. అర్జునుడు, అతని నిరుద్యోగ స్నేహితులు పోలీసుల నుండి ఎలా తప్పించుకున్నారు … వారు ఎలా విజయం సాధించారు అనేది కథ. ఇక ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చక్కగా ఉన్నాయి. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈసారి ప్రొడక్షన్‌లో విఫలమైంది. గ్రామ కరణంగా నరేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు.

సినిమాకు ప్లస్‌ పాయింట్స్‌
హీరో విష్ణు యాక్టింగ్‌
కామెడీ

మైనస్‌ పాయింట్స్‌
డైరెక్షన్
ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌
కథ

రేటింగ్‌ : 2.5 / 5

Read more RELATED
Recommended to you

Latest news