కలెక్టర్ పై దాడి చేసిన రైతులను అరెస్ట్ చేశారట. వికారాబాద్ జిల్లా లగిచర్ల ఘటనలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేసినట్లు చెబుతున్నానరు. కలెక్టర్ తో పాటు అధికారుల మీద దాడికి పాల్పడిన కొంతమంది రైతులను అదుపులోకి తీసుకున్నారట పోలీసులు. అయితే.. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ప్రభుత్వ తీరు అమానుషం …లగచర్ల వాసులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లగచర్ల గ్రామానికి 300 మంది పోలీసులు చేరుకొని గ్రామస్థులను అరెస్టు చేయడం దారుణం అన్నారు.
ఫార్మా భూసేకరణకు నిరాకరించిన వాళ్ళను పోలీసులతో బెదిరించాలని చూడడం దారుణం అని తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. అర్ధరాత్రి పోలీసులతో ప్రభుత్వం దమనకాండ నిర్వహించడం సరికాదన్నారు. ప్రభుత్వం తీరును ఖండిస్తున్నాం. ప్రజాభిప్రాయాన్ని తీలుసుకోకుండా భూసేకరణ చేపట్టడం వెనుక ఉన్న రేవంత్ రెడ్డి ఉద్దేశ్యం తెలియాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం వ్యక్తిగత ప్రయోజనాలకోసం చేపడుతున్న భూసేకరణను తక్షణం నిలిపివేయాలి. పోలిసుల అదుపులో ఉన్న గ్రామస్థులను, రైతులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.