ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.శనివారం మీడియాతో ఆయన అక్రమ అరెస్టులపై స్పందించారు.కావాలనే బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్లను టార్గెట్ చేశారని ఆరోపించారు.
‘కొందరు పోలీస్ అధికారులు గుర్తుంచుకోండి.రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి.రిటైర్డ్ అయినా, ట్రాన్స్‌ఫర్ అయినా వదిలిపెట్టం. సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు కూడా గుర్తుంచుకోండి. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.అప్పుడు ట్రిబ్యునల్ వేస్తాం. చట్టాన్ని అతిక్రమించిన పోలీసులు భారీ మూల్యం చెల్లించుకుంటారు’ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు.