అరబ్ దేశాల్లో ‘ఆర్టికల్ 370’ సినిమా బ్యాన్!

-

జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య సుహాస్ జంభలే డైరెక్షన్ లో బాలీవుడ్ న‌టి యామి గౌతమ్ ,ప్రియ‌మ‌ణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ సినిమా ‘ఆర్టికల్ 370’. ఇక ఈ చిత్రంపై గల్ఫ్ దేశాలన్నీ నిషేధం విధించాయి. దీనికి స్పష్టమైన కారణాలు లేనప్పటికీ ఇందులోని కొన్ని సన్నివేశాలు ఆందోళనకరమైన రీతిలో ఉన్నాయని.. అందుకే ఆయా దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కశ్మీర్లో జరిగిన పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రశంసలు అందుకుంది. కాగా గత నెలలో విడుదలైన ఫైటర్ చిత్రాన్ని కూడా ఈ దేశాలు బ్యాన్ చేశాయి.ఈ సినిమాని జియో స్టూడియోస్, A B62 స్టూడియోస్ బ్యాన‌ర్‌ల‌పై ఆదిత్య ధ‌ర్ నిర్మించాడు.

 

ఈ చిత్రం విడుద‌ల కాక‌ముందే ప్ర‌ధాని నరేంద్ర మోడీ కొన్ని విషయాల గురించి సరైన సమాచారం తెలుసుకోవాలంటే ‘ఆర్టికల్ 370’ లాంటి సినిమాలను చూడాలని ప్ర‌క‌టించాడు. దీంతో ఈ చిత్రం చూసిన నెటిజ‌న్లు కొంద‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తుండ‌గా.. మ‌రికొంద‌రు ఇది ఒక బీజేపీ ప్రాపగండ సినిమా అని.. సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news