ఊపందుకుంటోన్న క్విట్ బాలీవుడ్

-

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత ఒక్కసారిగా నెపోటిజం మళ్లీ వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్‌లోని నెపోటిజం వలనే సుశాంత్‌, ఆత్మహత్య చేసుకున్నాడని పలువురు తీవ్ర ఆరోపనాస్త్రాలు సంధిస్తున్నారు. కంగనా రనౌత్‌, వివేక్‌ ఒబెరాయ్‌ వంటి వారు కూడా బాలీవుడ్‌ కొంత మంది చేతుల్లోనే నడుస్తుందని చేసిన తీవ్ర వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. దీంతో ‘క్విట్ బాలీవుడ్’ అనేది ఒక ఉద్యమంలా తెరపైకి వచ్చింది. థప్పడ్ దర్శకుడు అనుభవ్ సిన్హా.. తాజాగా బాలీవుడ్ కి షాకిచ్చారు. అదేమంటే… ‘చాలు.. నేనిక ఇక్కడ ఉండలేను.. బాలీవుడ్ నుంచి రాజీనామా చేస్తున్నా.. ‘ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఆయనతో పాటు మరికొందరు సుధీర్ మిశ్రా, హన్సల్ మెహతా కూడా బాలీవుడ్ చోడో అంటూ ట్వీట్ చేశారు. తాము ఇండస్ట్రీలోకి ప్రసిద్ధ దర్శకులను చూసి వచ్చామని వారు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

అదేవిధంగా మరోపక్క బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ సూసైడ్ విషయంలో తాను చేసిన ఆరోపణలు నిరూపించలేకపోతే ప్రభుత్వం తనకు ఇచ్చిన ప్రతిష్టాత్మక పురస్కారం పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తానని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ స్పష్టం చేస్తున్నారు. సుశాంత్‌ చనిపోయిన తర్వాత కంగనా రనౌత్‌ సోషల్‌ మీడియా ద్వారా వీడియో స్టేట్‌మెంట్లు ఇస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లో నెపోటిజమ్‌ ఉందని, ప్రజర్‌‌ ఉంటుందని, వివక్ష చూపుతారని చాలా మందిపై ఆమె చేసిన కామెంట్స్‌ దుమారం రేపుతున్నాయి.

అంతేకాకుండా కొంత మంది జర్నలిస్టులపై కూడా ఆమె ఆరోపణాస్త్రాలు సంధించారు. అయితే ఆ ఆరోపణలను నిరూపించలేకపోతే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తానని ఆమె స్పష్టం చేశారు కూడా. అసలు ఆమె ఏమన్నారంటే.. “ నేను ఆరోపణలు చేసినందుకు ముంబై పోలీసులు నాకు సమన్లు పంపారు. నేను మనాలీలో ఉన్నానని, స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసేందుకు ఎవరనైనా పంపాలని చెప్పాను. కానీ నాకు వాళ్లు రెపాన్స్‌ ఇవ్వలేదు. నేను ఏదైనా చెప్పాను అంటే నిరూపించుకోగలను, లేని పక్షంలో నేను పద్మశ్రీ తిరిగి ఇస్తాను. నేను ప్రతీది పబ్లిక్‌గానే చేప్తాను” అంటూ చేసిన కంగనా కామెంట్స్ బాలీవుడ్ లో తీవ్ర ప్రకంపణలు రేపాయి. తాప్సీ, స్వరా భాస్కర్‌‌ వంటి వారు బాలీవుడ్‌ను ప్రేమిస్తున్నామని చెప్తారని, కరణ్‌ జోహార్‌‌ వంటి వాళ్లను అభిమానిస్తాం అని చెప్పినా ఆలియా, అనన్య వంటి వాళ్లకు మాత్రమే ఎందుకు చాన్స్‌ వస్తుందని కంగనా ప్రశ్నాస్త్రాలు సంధించారు.

అసలు ఇదే నెపోటిజమ్‌కి పెద్ద నిదర్శనమని ఆమె తేల్చి చెప్పారు. ఇలాంటి స్టేట్‌మెంట్స్‌ ఇస్తున్నందుకు తనను అంతా పిచ్చిది అనుకుంటారని కూడా ఆమె స్పష్టం చేశారు. కంగనా రనౌత్‌ను విచారణకు హాజరు కావాలని పిలిస్తే రాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే.. అయితే పోలీసులు అసలు పిలవలేదని, విచారణకు పిలిస్తే కంగనా కచ్చితంగా విచారణకు సహకరిస్తుందని ఆమె ప్రతినిధులు వివరించారు. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ది సూసైడ్‌ కాదని, ప్లాన్‌ మర్డర్‌‌ అని కంగనా రనౌత్‌ తొలి నుంచీ ఆరోపించారు. అందులో భాగంగా నెపోటిజమ్‌ ఉందని, కొందరికి మాత్రమే మంచి అవకాశాలు వస్తాయని ఆమె ఆరోపిస్తుండటం విశేషం. మరిప్పుడు సరికొత్తగా క్విట్ బాలీవుడ్ ఉద్యమం ఊపందుకోవడంతో ఎవరెవరు బయటకు వస్తారు అనేది వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version