మరి కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు జాబితాను విడుదల చేస్తున్నా సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికలకు బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో తెలంగాణ నుంచి తొమ్మిది మంది అభ్యర్థులకు చోటు కల్పించగా, అందులో నిజాంబాద్ నుంచి ధర్మపురి అరవింద్ కు బిజెపి అధిష్టానం ఎంపీ టికెట్ కేటాయించింది.ఇక సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు టికెట్ కేటాయించడం పట్ల బీజేపీలో అసమ్మతి సెగ రాజుకుంది. మళ్లీ అరవింద్ కే కేటాయించడంపై బీజేపీ నేత మీసాల శ్రీనివాస్, కార్పొరేటర్ మీసాల సవిత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
డేరా బాబా, నిత్యానందకు టికెట్ ఇచ్చినా ఓకే కానీ.. ధర్మపురి అర్వింద్‌కు మాత్రం ఇవ్వవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ నుంచే కాదు.. అసలు లోక్‌సభ బరిలో ఉండటానికే అనర్హుడు అని మీసాల శ్రీనివాస్ మండిపడ్డారు.నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిపై జాతీయ నాయకత్వం పునరాలోచన చేయాలని ,ఈ విషయాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తే క్షేత్రస్థాయిలో పార్టీకి అంత నష్టం జరుగుతుందని మీసాల శ్రీనివాస్ హెచ్చరించారు.