వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డి మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై ముఖ్యమంత్రి రేవంత్ స్పందించారు. తన కుటుంబంలో ఎవరూ ఎంపీగా పోటీ చేయరని ఆయన తెలిపారు. తనను ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కలవడంలో ఎలాంటి రాజకీయం లేదని, ముఖ్యమంత్రి ని ఎమ్మెల్యేలు కలిస్తే ఏదో జరుగుతున్నట్లుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారని విమర్శించారు.
మంగళవారం నాడు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తమ ప్రభుత్వం ఎందుకు పడిపోతుందో విమర్శించే వారే చెప్పాలని ,అసెంబ్లీకి రాని కేసీఆర్ ప్రతిపక్ష నేత ఎలా అవుతారని ప్రశ్నించారు.కేసీఆర్ పాలనలో వందేళ్ల విధ్వంసం చేస్తే..వంద రోజుల్లో తమ ప్రభుత్వం పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.తమ ప్రభుత్వ పరిపాలన రిఫరెండంగా లోక్ సభ ఎన్నికలకు వెళ్తామని అన్నారు.14కు పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణలో పోటీ చేస్తే రాష్ట్ర గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు.