హుస్నాబాద్ పట్టణంలో ఆర్య వైశ్య భవనం ఏసీ కమ్యూనిటీ హాల్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హుస్నాబాద్ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
కమ్యూనిటీ హాల్ ప్రారంభం అనంతరం మంత్రి మాట్లాడుతూ..పట్టణంలో అనేక పరిశ్రమలు, సంస్థలు వస్తున్నట్లు ప్రకటించారు. ఆర్య వైశ్య భవనం ఏసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి రూ.45 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి వివరించారు. రాబోయే రోజుల్లో హుస్నాబాద్ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.