ముంబై క్రూయిజ్ షిష్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ తో సహ పలువురు అరెస్ట్ అయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. అయితే.. ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులోని ఓ ప్రధాన సాక్షి ఇవాళ మరణించాడు.
ఈ కేసులో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో సాక్షిగా ఉన్న ప్రభాకర్ సెయిల్ గుండె పోటుతో మరణించాడు. శుక్ర వారం మధ్యాహ్నం ముంబై పరిధిలోని చెంబూర్ లోని మహుల్ ప్రాంతంఓని అద్దె ఇంట్లో అతని మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.
2021 లో నమోదు అయిన ఆర్యన్ ఖాన్ కేసులో ప్రభాకర్ ఇండిపెండెంట్ విట్ నెస్ గా ఉన్నాడు. ప్రభాకర్ మృతి లో ఎలాంటి అనుమానాలు లేవని అతని కుటుంబం దృవీకరించిన విషయాన్ని ప్రభాకర్ తరఫు న్యాయవాది తుషార్ ఖాండేర్ స్పష్టం చేశారు. ఇక ప్రభాకర్ కు తల్లి, భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ప్రభాకర్ మృతితో ఆయన కుటుంబం విషాదంలోకి వెళ్లింది.