షమీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు : పాక్ మ్యాచ్ పై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు !

నిన్న దుబాయ్ వేదికగా జరిగిన ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ లో… టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. అందరూ గెలుస్తుందనుకున్న మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు చేతులెత్తేశారు. దీంతో టీమిండియా ఆటగాళ్లపై… భారత నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని… సోషల్ మీడియాలో… దారుణమైన బూతులతో తిడుతున్నారు నెటిజన్లు.

అయితే తాజాగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై… ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ఓడిపోతే… మహమ్మద్ షమీ ని టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నించారు.

జట్టులో 11 మంది సభ్యులు ఉంటారని… అందరూ బాగా ఆడితేనే జట్టు విజయం సాధిస్తుందని చెప్పారు ఓవైసీ. కానీ… ఒక ముస్లిం వ్యక్తి కాబట్టి మహమ్మద్ షమీ ని… దారుణంగా తిడుతున్నారు అని ఫైర్ అయ్యారు. మహమ్మద్ షమీ ఒక ముస్లిం ఆటగాడు కాబట్టే అందరూ టార్గెట్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. దీనిపై బిజెపి ప్రభుత్వం అసలు స్పందించడం లేదని మండిపడ్డారు. మహమ్మద్ హామీపై ట్రోలింగ్ చేసేవారి పై చర్యలు తీసుకోరా ? అని ప్రశ్నించారు ఓవైసీ.