Aslem Jarigindi Movie: “అసలేం జరిగింది?”.. ఈ నెల 22న తెలుస్తుంది!

Aslem Jarigindi Movie : రోజాపూలు, ఒకరికి ఒకరు వంటి చిత్రాల్లో న‌టించి మెప్పించిన హీరో శ్రీ‌రామ్. తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నారు. కానీ .. ఆయ‌న‌కు టాలీవుడ్లో కంటే.. కోలివుడ్ లోనే ఎక్కువ‌ పాపులారిటీ, క్రేజ్ ఉంది. దీంతో త‌మిళ సినిమాలనే చేస్తున్నాడు. అప్పుడప్పుడూ తెలుగులో సపోర్టింగ్ రోల్స్ మంచి పేరు ద‌క్కించుకున్నాడు.

అయితే చాలా రోజుల తరువాత.. మ‌రోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నారు. శ్రీరామ్ హీరోగా.. సంచితా పదుకునే హీరోయిన్ గా తెర‌కెక్కుతున్న “చిత్రం అసలేం జరిగింది?”. ఈ చిత్రానికి ఎన్వీఆర్ దర్శకత్వం వ‌హించ‌గా.. మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడలు ఎక్స్‌డోస్ మీడియా బ్యాన‌ర్‌పై
నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యి.. సెన్సార్ క్లియ‌రెన్స్ ల‌భించింది.

అయితే.. ఈ చిత్రాన్ని థియేట‌ర్లో రిలీజ్ చేయాలా? లేక ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ చేయాలా? అనే సందేహాల మ‌ధ్య థియేటర్స్‌లోనే విడుదల చేయాలని మూవీ మేక‌ర్స్ నిర్ణయించుకున్నారు. ఈ మేర‌కు ఈ నెల 22న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఒరిస్సా, అండమాన్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన వాస్తవిక సంఘటనళల‌ ఆధారంగా
తెర‌కెక్కుతున్న స‌స్పెన్స్ థ్రిల్లర్ ల‌వ్ స్టోరీ ‘అస‌లేం జరిగింది?’. కొత్త కాన్సెప్టుతో పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ అని తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తుంద‌ని చిత్ర నిర్మాత కింగ్ జాన్సన్ తెలిపారు.

విజ‌య్ ఏసుదాస్‌, విజ‌య్ ప్రకాష్‌, యాజిన్ నిజార్‌, మాళ‌విక‌, రాంకీ, భార్గవి పిళ్లై వంటి ప్రముఖ సింగ‌ర్లు పాడిన పాట‌ల‌కు అమెజాన్ మ్యూజిక్‌, స్పాటిఫై, జియోసావ‌న్‌, యాపిల్ మ్యూజిక్ వంటి మ్యూజిక్ ప్లాట్‌ఫార‌మ్స్ నుంచి చ‌క్కటి రెస్సాన్స్ వ‌స్తున్నందుకు సంతోషంగా ఉంద‌న్నారు.
తొలుత ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ చేయాల‌ని భావించినా.. ఫైన‌ల్ గా థియేట‌ర్స్ లో రిలీజ్ చేయాలని నిర్ణ‌యించామ‌ని తెలిపారు.

ఈ సినిమాకు ప్రముఖ బ్యాక్ గ్రౌండ్ స్కోర‌ర్ ఎస్‌.చిన్నా ప్రాణం పోశార‌ని, సేతు స్పెష‌ల్ ఎఫెక్ట్స్ వంటివి ప్రేక్షకుల్ని చివ‌రి వ‌ర‌కూ ఉత్కంఠ‌ను క‌లిగిస్తాయ‌ని తెలిపారు. అలాగే.. హీరో శ్రీరాం ఈ సినిమాకు ప్రాణం పోశారని, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌నే న‌మ్మక‌ముంద‌ని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ యేలేంద్ర మ‌హావీర్ స్వర‌క‌ల్పన అద్భుతమని చిత్ర నిర్మాత నీలిమా చౌద‌రి తెలిపారు.