ఈ రోజుల్లో త్వరగా పాపులర్ కావాలంటే ఒకటి హీటెక్కిస్తూ రెచ్చిపోవడం.. రెండు బిగ్ స్టార్స్ చిత్రాల్లో క్రేజీ ఆఫర్లని దక్కించుకోవడం. కొంత మందికి కెరీర్ ప్రారంభంలో రెండవ అవకాశం దక్కడం చాలా అరుదు. దాంతో చాలా మంది త్వరగా పాపులర్ కావలంటే గ్లామర్ షోనే ఆయుధంగా వాడుతున్నారు. సక్సెస్ అవుతున్నారు. సినిమాల్లో అవకాశాలు పెద్దగా రాకపోయినా సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తూ పాపులర్ అవుతున్నారు.
హర్యానా చిన్నది అషిమా నర్వల్ కూడా మొదటి దారినే ఎంచుకుంది. `నాటకం` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలో పదహారణాల పల్లెటూరి యువతిగా కనిపించి లేలేత పరువాల విందు చేసింది. సోషల్ మీడియాని నమ్ముకున్న అషిమా అందులో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. చేసింది తక్కువ సినిమాలే అయినా ఇన్ స్టా వేదికగా హాట్ హాట్ కంటెంట్‌ని అందిస్తూ నెటిజన్స్‌ని ఎట్రాక్ట్ చేస్తోంది.
తాజాగా పింక్ బికినీ తరహా డ్రెస్‌లో ఫొటోలకు పోజులిచ్చింది. ఒక్క సారిగా ఊహించని స్థాయిలో అషిమా పింక్ డ్రెస్‌లో అందాల్ని పరిచేస్తూ పిచ్చెక్కించేస్తోంది. మరింత గ్లామర్‌ని వెండితెరపై ఆరబోయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదనే సంకేతాల్ని అందిస్తోంది. ఈ హాట్ షోతో అయినా అషిమా నర్వల్ టాలెంట్‌ని టాలీవుడ్ దర్శక నిర్మాతలు గుర్తిస్తారేమో చూడాలి.