అశోక్ గజపతిరాజు, సంచయత మధ్య మరోసారి రాజకీయ దుమారం..!

-

అశోక్ గజపతిరాజుపై సింహాచలం దేవస్ధానం చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కొన్ని నెలల క్రితం సంచయిత సింహాచలం దేవస్థానం చైర్పర్సన్ గా నియమితులైన అప్పుడు చాలా మేరకు రాజకీయ దుమారం రాజుకుంది. నేటికీ ఇరువర్గాల నాయకులు ఎప్పటికప్పుడు ఘాటైన వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తున్నారు.నేష‌న‌ల్ మిష‌న్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేష‌న్ అండ్ స్పిర్చువ‌ల్ అజ్‌మెంటేష‌న్ డ్రైవ్‌(ప్రసాద్‌) ప‌థ‌కానికి సింహాచ‌లం దేవస్థానాన్ని ఎంపిక చేస్తున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక మంత్రి ప్రహ్లాద్ పటేల్, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్‌కు ప్రత్యేక కృతజ్ణతలు తెలిపారు. ‘దేవస్థానం భూముల్లో మొక్కల పెంపకంలో ఎకరానికి లక్ష రూపాయిలిచ్చే స్కీమ్‌ని కేంద్రం ప్రవేశపెట్టినా గత పాలకులు పట్టించుకోలేదని సంచయిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sanchayitha

గత నాయకులకు రాజకీయాలపై ఉన్న దృష్టి అభివృద్ధిపై చూపించలేదని. అందుకే ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించి అభివృద్ధికి అడ్డుగా నిలబడ్డారు అని అన్నారు.ముఖ్యమంత్రిచంద్రబాబు, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకి నిజమైన ప్రేమ ఉంటే కేంద్రానికి ప్రతిపాదనలు పంపేవారు కదా అని వ్యాఖ్యానించారు.సింహాచలం దేవస్ధానం అభివృద్ది చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నా. నా పనితీరు ద్వారానే నాపై విమర్శలు చేస్తున్న వారికి సమాధానం చెబుతాను అని గురువారం మీడియా వేదికగా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version