కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక రేసు నుంచి గాంధీలు ఔట్ : అశోక్ గహ్లోత్

-

కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం గాంధీలు పోటీ చేస్తారా లేదా అనే విషయంలో ఇన్నాళ్లు క్లారిటీ లేదు. దీనిపై రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్ స్పష్టతనిచ్చారు. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పార్టీ అధ్యక్షుడిగా ఉండరని రాహుల్‌ గాంధీ వెల్లడించారని గహ్లోత్ తెలిపారు.

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్‌ తిరిగి బాధ్యతలు చేపట్టాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారనీ.. ఇదే విషయం చెప్పి, ఆయన్ను ఒప్పించేందుకు పలుమార్లు ప్రయత్నించామని అన్నారు. అయితే.. దీనికి రాహుల్‌ తిరస్కరించినట్లు గహ్లోత్‌ వివరించారు. తదుపరి అధ్యక్షుడిగా గాంధీ కుటుంబం నుంచి ఎవరు ఉండకూడదని నిర్ణయించినట్లు రాహుల్ తెలిపారని గహ్లోత్ వెల్లడించారు.

మరోవైపు ఈ అధ్యక్ష ఎన్నిక బరిలో గహ్లోత్ ముందువరుసలో ఉన్నారు. గత కొద్దికాలంగా ఆయనే పార్టీ అధినేత అవుతారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. శశిథరూర్‌, దిగ్విజయ్ సింగ్, కమల్‌ నాథ్ వంటి పలువురు సీనియర్ నేతల పేర్లూ వెలుగులోకి రావడంతో ఎన్నిక అనివార్యమయ్యేలా కనిపిస్తోంది. ఈ ఎన్నికకు సంబంధించి నిన్న నోటిఫికేషన్ కూడా విడుదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news