Ashu Reddy- Express Hari: బుల్లితెర‌పై మ‌రో ప్రేమాయ‌ణం..! ఎక్స్‌ప్రెస్ హ‌రికి కాస్ట్‌లీ గిప్ట్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

-

Ashu Reddy- Express Hari: బుల్లితెర మీద‌ ల‌వ్ స్టోరీల‌కు కొద‌వేం లేదు. సెలబ్రెటీలు ప్రేమ ప‌క్షులుగా మారి ప్రేక్ష‌కుల మందు తెగ రెచ్చిపోతున్నారు. ఇప్ప‌టికే .. జ‌బ‌ర్థ‌స్త్ ఫేం సుడిగాలి సుధీర్, బుల్లితెర హ‌ట్ యాంకర్‌ రష్మీ ల జంటకు ఎంత క్రేజ్ ఉందో అంద‌రికీ తెలిసిందే.. ఇక ఈ మధ్యకాలం మ‌రో జంట‌.. జబర్దస్త్ ఫేం వర్ష, ఇమాన్యుల్ లు కూడా ల‌వ్‌బ‌ర్డ్స్‌గా మారి బుల్లితెర మీద ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. వీళ్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఇలా చేస్తున్నారా? నిజంగా లవ్ లోనే ఉన్నారా అనేది వారికే తెలియాలి.

ఇదిలా ఉంటే.. తాజాగా.. మ‌రో జంట చాలా వైర‌లవుతుంది. వాళ్ల మీద పుకార్లు ఓ రేంజ్‌లో షికార్లు చేస్తున్నాయి. వాళ్లే బుల్లితెర సెలబ్రిటీ, బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి, కామెడీ స్టార్, ప‌టాస్ ఫేమ్ ఎక్స్‌ప్రెస్ హరిలు. ఈ జంట కామెడీ స్టార్స్ స్టేజ్ మీద తెగ సంద‌డి చేస్తుంది. తాజాగా వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యం బయట పడింది. స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అవుతున్న ‘కామెడీ స్టార్స్’ షోలో తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి స్కిట్లు చేయ‌డంతో వీళ్ల మధ్య ఏదో న‌డుస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వార్త‌ల‌ను నిజం చేస్తూ ఇప్ప‌టికే హరి.. తన గుండెలపై అషు పేరును టాటూగా వేయించుకున్నాడు.

తాజాగా మ‌రోసారి.. త‌న ల‌వ్ ను ఎక్స్ ప్రెస్ చేసింది అషూరెడ్డి. హ‌రి కోసం అషూరెడ్డి చాలా ఖ‌రీదైన గిప్టు ఇచ్చి.. స‌ర్‌ప్రైజ్ చేసింది. కామెడీ స్టార్స్ వేదిక‌గా .. అషూరెడ్డి హ‌రికి చాలా ఖ‌రీదైన ఓ సూప‌ర్ బైక్‌ను ఇచ్చి త‌న ల‌వ్‌ను ఎక్స్ ప్రెస్ చేసింది. ఈ సీన్ చూస్తుంటే.. వారిద్ద‌రి ల‌వ్ ట్రాక్ సీరియ‌స్ మోడ్‌లోకి వెళ్లిందా? అనుమానులు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అలా కాకుండా ఇద్ద‌రం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్ప‌డానికే ఇలా చేసిందా తెలియాల్సి ఉంది. కానీ , హ‌రి రియాక్ష‌న్ చూస్తే.. మ‌రోలా అనిపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ త‌న పేరెంట్స్ కూడా ఇలాంటి కాస్ట్లీ గిప్ట్ ఇవ్వ‌లేద‌ని చాలా ఎమోష‌న్ అయ్యాడు హ‌రి. అంతేకాకుండా చివ‌రికి అషూరెడ్డిని హ‌గ్ చేసుకుని.. అంద‌ర్ని షాక్ కి గురి చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version