ఆత్రపడే కాంబాబు, అరగంట పనోడు అవంతి అంటూ లోకేష్ ఫైర్..!

-

విశాఖ వైసీపీ నాయకుడు వెంకటరావు దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ నారాలోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సభ్యసమాజం తలదించుకునేలా దివ్యాంగురాలిపై అఘాయిత్యానికి పాల్పడటం దారుణమ‌ని అన్నాడు. దివ్యాంగురాలికి సాయం అందించాల్సిన చేతులే చిదిమేయడం ఘోరమంటూ లోకేష్ ఫైర్ అయ్యారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కామాంధుల్లా అఘాయిత్యాలకు తెగపడుతుంటే, తామేమి తక్కువ తినలేదంటూ వైసీపీ నాయకులు అత్యాచారాలకు ఒడిగడుతున్నారని నారాలోకేష్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

కాటికి కాలుచాపే వయస్సులో అన్నీ చేయించుకోవాలనే ఆత్రపడే కాంబాబు, అరగంట పనోడు అవంతిని ఆదర్శంగా తీసున్నాడేమో? అంటూ లోకేష్ ఫైర్ అయ్యారు. వైకాపా రేపిస్టుల తరపున పోలీసులు వకాల్తా పుచ్చుకుని.. చచ్చు మాటలు పుచ్చు వాదనలతో ప్రెస్ మీట్ పెట్టొద్దని చెప్పారు. మీకు చేతనైతే, మీరు నిజమైన పోలీసులైతే నిందితుడిని కఠినంగా శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయాలంటూ లోకేష్ డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version