ఆ ప్రశ్న అడిగిన నెటిజన్… అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..!

-

తెలుగు సినీ ప్రేక్షకులకు అషూ రెడ్డి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది బుల్లితెర అభిమానులను సంపాదించుకుంది. అషూ రెడ్డి కేవలం సోషల్ మీడియా ద్వారా, బుల్లితెర ద్వారా మాత్రమే కాకుండా కొన్ని సినిమాల్లో కూడా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.

ఇలా సోషల్ మీడియా ద్వారా, బుల్లితెర ద్వారా, సినిమాల ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోయడంలో కూడా ఏమాత్రం వెనకడుగు వేయదు. ఎప్పటికప్పుడు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉండే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు సోషల్ మీడియా లైవ్ లో కూడా పాల్గొంటూ అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే అషూ రెడ్డి తాజాగా బిగ్ బాస్ ఫేమ్ జస్వంత్ పడాలతో కలిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొంది. ఈ లైవ్ సెషన్‌లో జరిగిన ఓ సంఘటన కారణంగా ప్రస్తుతం అషూ రెడ్డి వార్తల్లో నిలిచింది. లైవ్ సెషన్ లో భాగంగా ఓ నెటిజన్ ‘అషు మనం లేచిపోదామా’ అని అడిగేశాడు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన అషూ రెడ్డి ఏం చెప్పాలో అర్థంకాక ఓకే చిల్‌ అంటూ రిప్లై ఇచ్చింది. ఇది ఇలా ఉంటే అషూ రెడ్డి ‘ఫోకస్’ అనే మూవీ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version