సీ సెక్షన్ ద్వారా డెలివరీ అయినప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

-

సీ సెక్షన్ ద్వారా ప్రసవించిన తల్లులకు కుట్ల దగ్గర చాలా నొప్పి ఉంటుంది. ఆ కుట్లు త్వరగా మానాలన్నా, చీమి పట్టకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ రకమైన ఆహారం తినాలి, తిరిగి మళ్లీ ఎప్పటినుంచి సాధారణ పనులు చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం..!
C-section
C-section
ఆపరేషన్ చేసి బిడ్డను తీసినప్పుడు ఆ భాగంలో కుట్లు వేయటం వల్ల నొప్పి ఎక్కువగానే ఉంటుంది. నొప్పి త్వరగా మానాలంటే..అన్నం, కూరలు, ఇడ్లీ, జావలు ఇవన్నీ మానేసి..ఉదయం పూట ఒక గ్లాస్ పండ్లరసం కానీ, కూరగాయల రసం కానీ ఏదో ఒకటి తాగుతూ..9.30- 10 గంటలకు నాలుగరకాల పండ్లు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోండి. మధ్యాహ్నపూట కుదిరితే కొబ్బరిపాలు లేదంటే..మూములు పాలు తీసుకుని అందులో బాదంపప్పు, పిస్తాపప్పు, జీడిపప్పు వేసుకుని 7-8 గంటలు నానపెట్టుకుని నానినవాటిని గ్రైండ్ చేసి..
ఆ పేస్ట్ ను పాలల్లో కలిపి, అందులో యాలుకల పొడి, తేనె, ఎండు ఖర్జూరం పొడి వేసుకుని తాగండి. తినటం లేదనేకానీ…బాడీకి కావాల్సినవి అన్నీ అందుతాయి. ఘన ఆహారాలు, ఉడికిన ఆహారాలు మంచివి కాదు. ఇలా చేస్తే పదిరోజుల్లో మానే కుట్లు ఐదురోజుల్లోనే మానతాయట. సాయంకాలం పుల్లటి జ్యూస్ బత్తాయి, కమలాలు, నారింజ, దానిమ్మ, పైనాపిల్ ఏదోఒకటి తీసుకుండి. రాత్రి 7కి ఎండుఖర్జూరాలు, అంజీరా, కిస్ మిస్, రెండురకాలు ఫ్రూట్స్, ఇవి తీసుకుని..డిన్నర్ ముగించేయండి. ఇలాంటి డైట్ ఫాలో అయితే..పాలుపడతాయి, చీమిపట్టదు, పొట్టకు హాయిగా ఉంటుంది. బాడీలో ఇన్ఫ్లమేషన్స్ రావు. త్వరగా కోలుకుంటారు.

కుట్లు ఉన్న చోట దురదలు, నడుము నొప్పి వస్తుంది..వాటికి పరిష్కారం ఏంటంటే..

కుట్లు దగ్గర తేనె రాస్తుంటే..త్వరగా ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. క్రిములు వెళ్లకుండా బాగా రక్షణ కలిగిస్తుంది. దురద తగ్గటానికి స్నానం చేసిన తర్వాత కొబ్బరినూనె రాసుకోవచ్చు. మత్తు ఇంజక్షన్ కారణంగా..నడుమునొప్పి వస్తుంది. వేడినీళ్ల కాపడం చాలా మంచిది. ముద్దకర్పూరం తీసుకుని ఆవనూనెలో వేసుకుని ఆ నూనెతో నడుముమీద రాయించుకుని..లైట్ గా మసాజ్ చేయించుకుని.. వేడి నీళ్ల కాపడం పెట్టుకుంటే రోజుకు రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఉపశమనం వస్తుంది. ఇక తలనొప్పి కూడా ఈ టైంలో వస్తుంది..ఇది తగ్గించుకోవడానికి పిప్పరమెంట్ ఆయిల్ రాసుకుంటే నొప్పి బాగా తగ్గుతుంది. సహజంగానే స్త్రీలు మంచినీళ్లు తక్కువ తాగుతారు. ఇంకా ఈ ఆపరేషన్ చేసిన టైంలో చాలా తక్కువ తాగుతారు. మంచినీళ్లు తక్కువ తాగితే..పాలు తగ్గుతాయి తెలుసా..సైంటిఫిక్ గా WHO బాలింతలకు రోజుకు 5లీటర్లు కచ్చితంగా తాగాలని ఇచ్చారు. వాటర్ బాగా తాగటం వల్ల పాలు వస్తాయి, తలనొప్పికూడా రాదు. తలస్నానం చేయటం కూడా రిలాక్షేషన్ కు చాలా మంచిది.

ఎప్పటినుంచి మళ్లీ పనులు, ఆసనాలు చేయొచ్చు..?

చిన్న ఆపరేషన్ చేసుకున్నవాళ్లు..నాలుగువారాల పాటు బాగా రెస్ట్ తీసుకోవాలి. ఎంత రెస్ట్ తీసుకుంటే..అంత త్వరగా హీలింగ్ జరుగుతుంది. కుట్లన్నీ కలిసిపోయి..సాధారణ స్థితికి వచ్చేస్తాయి. నెల నుంచి రెండు నెలల పాటు..తేలికపాటి పనులు, ఇంట్లో చిన్నచిన్న వస్తువులు పట్టటం, ఒత్తిడి లేకుండా సుఖంగా ఉండే పనులు, కదలటం చేసుకోవచ్చు. వ్యాయామాలు, ఎక్సర్ సైజులు, వాకింగ్ ఇవన్నీ చేయాలంటే..నాలుగు నెలలు దాటాల్సిందే. ఈ నాలుగు నెలలు మంచిగా రెస్ట్ తీసుకుంటే..లేయర్స్ అన్ని హెల్తీగా అవుతాయి.

ఆపరేషన్ ద్వారా డెలివరీ అయిన తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దగ్గటం, పెద్దగా తుమ్మటం, ముక్కటం ఇవి మాత్రం చేయకూడదు. ఇలా ఎక్కువ చేసినప్పుడు ఆ భాగంలో కుట్లు ఊడిపోవటం జరుగుతుంది. టేస్ట్ కోసం దగ్గు, జలుబు చేసే ఆహారాలు తినకూడదు. దగ్గేప్పుడు కూడా..పొట్టమీద చేతులు పెట్టుకుని ప్రజర్ పడకుండా జాగ్రత్తపడాలి.
ఆపరేషన్ చేయించుకుని బెడ్ మీద తల్లి..బిడ్డతో ఎక్కువగా గడపడం, బిడ్డతో సంతోషంగా ఉంటే..హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ గర్భాశయం త్వరగా కోలుకోవడానికి, పాలుబాగా రావడానికి, పెయిన్స్ త్వరగా తగ్గడానికి ఉపయోగడతాయి. అందుకే గర్భీణీలను, బాలింతలను వీలైనంత హ్యాపీగా, ఎలాంటి మానసిక ఆందోళన లేకుండా చూసుకోవాలి. కానీ కొంతమంది ఆ టైంలో..కోరుకున్న సంతానం కలగలేదని..ఆడపిల్ల కావాలంటే..మగబిడ్డ పుట్టిందని..మగబిడ్డ కావాలంటే..ఆడపిల్ల పుట్టిందని కుటుంబసభ్యులు ఏదో ఒకటి అంటుంటారు..ఆపరేషన్ అయిందేంటి..నాచురల్గా అవుతుంది అనుకున్నాం కదా..అని అంటుంటారు. అసలు ఇవేవి పట్టించుకోవద్దు..ఆరోగ్యకరంగా మీ బిడ్డ బయటకువచ్చింది..చాలు, అనేవాళ్లు వంద అంటారు. పాజిటివ్ గా ఆలోచించాలి, వెయిట్ పెరగకూడదు, బిడ్డ నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటూ ఉండాలి.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version