అశ్వగంధ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది మనకి ఆయుర్వేదిక్ స్టోర్స్ లో దొరుకుతూనే ఉంటుంది. ఎక్కువగా దీనిని ఆయుర్వేదిక్ మందులు లో ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని తీసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ మనకి కలుగుతాయి. మరి ఇక ఆలస్యమెందుకు దీని వల్ల కలిగే ప్రయోజనాలు, ఎటువంటి సమస్యలు తరిమికొట్టొచ్చు…? ఇలా అనేక విషయాలు తెలుసుకుందాం.
బ్లడ్ షుగర్ ని తగ్గిస్తుంది:
అశ్వగంధ ఇన్సులిన్ సెన్సిటివిటీ అభివృద్ధి చేసి ఇన్సులిన్ విడుదలని పెంచుతుందని పరిశోధకులు అంటున్నారు. కనుక డయాబెటిస్ ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా మామూలు వాళ్ళు కూడా దీనిని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ తగ్గుతుంది.
క్యాన్సర్ తో పోరాడుతుంది:
అశ్వగంధ కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంచుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్, కలోన్ కేన్సర్, లంగ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్ వంటివి దరిచేరకుండా ఉంచుతుంది అని పరిశోధన ద్వారా తెలిసింది.
గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది:
అశ్వగంధని ఉపయోగించడం వల్ల కొలెస్ట్రాల్ మరియు బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. తద్వారా ఇది గుండెకు కూడా మేలు చేస్తుంది.
ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది:
అశ్వగంధ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీనితో ఇది ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది అలానే ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్స్ తో కూడా పోరాడుతుంది.
ఒత్తిడిని దూరం చేస్తుంది:
ఎప్పుడైనా విపరీతమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు అశ్వగంధని ఉపయోగించారు అంటే ఇది చక్కగా పని చేస్తుంది. దీంతో ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది.