Asia Cup 2022 : శ్రీలంకపై ఓడిన టీమిండియా… ఫైనల్ చేరాలంటే ఇది జరగాల్సిందే !

-

ఆసియా కప్ లో భాగంగా నిన్న జరిగిన రసవత్తర పోరులో టీమిండియా పై ఏకంగా ఆరు వికెట్ల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. అయితే ఆ భారీ లక్ష్యాన్ని శ్రీలంక అవలీలగా చేదించింది. 19.5 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 174 లక్ష్యాన్ని చేదించింది శ్రీలంక.

అయితే  ఈ మెగా ఈవెంట్ లో టీమిండియా ఫైనల్ కు చేరాలంటే అద్భుతలే జరగాలి. సూపర్ 4 లో భాగంగా బుధవారం పాకిస్తాన్ తో జరగనున్న మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించాలి. అదే విధంగా సెప్టెంబర్ 8న ఆఫ్ఘనిస్తాన్ తో జరగనున్న సూపర్ 4 మ్యాచ్ లో టీమిండియా భారీ విజయం సాధించాలి. అంతేకాకుండా సెప్టెంబర్ 9న పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ లో శ్రీలంక విజయం సాధించాలి.

 

ఈ క్రమంలో భారత్-పాక్ ఆఫ్గాన్ జట్లు చెరో విజయంతో సమంగా నిలుస్తాయి. అప్పుడు రన్ రేట్ ఆధారంగా మూడింటిలో ఒక జట్టు ఫైనల్ లో అడుగుపెట్టనుంది. కాగా సూపర్-4 లో వరుసగా రెండు విజయాలు సాధించిన శ్రీలంక దాదాపుగా ఫైనల్ లో అడుగుపెట్టినట్టే. ఇక రన్ రేట్ విషయానికి వస్తే, భారత్,ఆఫ్గానిస్థాన్ కంటే పాకిస్తాన్ మెరుగ్గా ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version