కారుకు చెక్…మరో కేంద్ర మంత్రి పదవి?

-

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఎలాగైనా చెక్ పెట్టే దిశగానే బీజేపీ రాజకీయం నడుస్తోంది..ఖచ్చితంగా కేసీఆర్‌ని గద్దె దించి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. ప్రతి విషయంలోనూ టీఆర్ఎస్ టార్గెట్ గానే రాజకీయం జరుగుతుంది. ఎక్కడకక్కడ టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది.

అలాగే కేంద్ర మంత్రులు, కేంద్రం పెద్దలు సైతం తెలంగాణపై ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. తెలంగాణకు కేంద్ర ఏమి ఇచ్చిందనే లెక్కలు తేలుస్తున్నారు. దాదాపు ఆరుగురు కేంద్ర మంత్రులు తెలంగాణపైనే దృష్టి పెట్టారు. అటు టీఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి బలమైన నాయకులని లాగేసుకుంటున్నారు. ఇలా కేంద్ర మంత్రుల ఉండటం వల్ల…రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీకి కాస్త ఇబ్బందికర పరిస్తితులే ఉంటున్నాయి. కేంద్ర మంత్రులని అడ్డుకునే బలం టీఆర్ఎస్ పార్టీకి బలం లేదు.

అందుకే బీజేపీ వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టడానికి అదిరిపోయే స్కెచ్‌తో ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కీలక నేతలందరికి కీలక పదవులు ఇచ్చారు. బండి సంజయ్ ఇటు ఎంపీగా, అటు రాష్ట్ర అధ్యక్షుడుగా దూసుకెళుతున్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడుగా…కేబినెట్ హోదా గల నామినేటెడ్ పదవిలో ఉన్నారు.

ఇదే సమయంలో టీఆర్ఎస్ పార్టీపై మరింత దూకుడుగా వెళుతున్న ధర్మపురి ఆరావింద్‌కు కేంద్ర పదవి ఇచ్చేలా బీజేపీ ప్లాన్ చేసిందని తెలిసింది. కిషన్ రెడ్డి కాకుండా రాష్ట్రానికి మరొక పదవి ఇవ్వాలని బీజేపీ చూస్తుందట. అందులోనూ తెలంగాణలో ఎక్కువగా ఉన్న బీసీ ఓటర్లని ప్రభావితం చేసేలా..బీసీ నేతకు మంత్రి పదవి ఇవ్వనున్నారట.

ఇప్పుడు ఉన్నవారిలో బండి సంజయ్, లక్ష్మణ్, అరవింద్‌లు బీసీ నేతలు…వీరిలో సంజయ్, లక్ష్మణ్‌లకు పదవులు ఉన్నాయి. దీంతో అరవింద్‌ని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుని, టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టాలని బీజేపీ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. మరి చూడాలి ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version