ASIA CUP: కీలక మ్యాచ్ లో బంగ్లాదేశ్ భారీ విజయం … మెహిదీ, శాంటో సెంచరీ లు !

-

నిన్న మధ్యాహ్నం జరిగిన ఆసియా కప్ కీలక మ్యాచ్ లో బంగ్లాదేశ్ మరియు ఆఫ్గనిస్తాన్ లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా కీలకం అని తెలిసిందే. సూపర్ 4 కు అర్హత సాధించాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ప్లాన్ లో భాగంగా ఓపెనర్లుగా నయీమ్ మరియు అల్ రౌండర్ మెహిదీ హాసన్ మిరాజ్ ను పంపించారు. ఈ ప్రయోగం బంగ్లాదేశ్ కు బాగా వర్క్ అవుట్ అయింది. మెహిదీ హాసన్ వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకుని సెంచరీ (112) సాధించాడు. ఇతని ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు మరియు మూడు సిక్సులు ఉన్నాయి. ఇక ఇతనికి చక్కని సహకారం అందించిన వారిలో నజముల్ హాసన్ శాంటో (104) సెంచరీ సాధించి జట్టుకు భారీ స్కోర్ ను అందించాడు. వీరిద్దరూ మూడవ వికెట్ కు 215 పరుగులు జోడించారు. ఇక ఆఖర్లో షకీబ్ మరియు ముషఫికర్ రహమాన్ లు వేగంగా పరుగులు చేయడంతో జట్టు స్కోర్ 334 కు చేరుకుంది. అనంతరం భారీ టార్గెట్ ను చేధించడానికి క్రీజులోకి వచ్చిన ఆఫ్గనిస్తాన్ పోరాడి పోరాడి చివరకు 245 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది.

ఓపెనర్ జాడ్రన్ (75) మరియు కెప్టెన్ షాహిద్ (50) లు అర్ద సెంచరీ లతో రాణించగా, మిగిలిన వారందరూ విఫలం కావడంతో కీలక మ్యాచ్ లో ఆఫ్ఘన్ భారీ ఓటమిని కొనితెచ్చుకుంది. ఈ విజయంతో బంగ్లాదేశ్ కు సూపర్ 4 లో చోటు ఖాయమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version